అమరావతి రాజధానిపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.ఈ క్రమంలో ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఈనెల 31 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది.అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అమరావతిలో నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో కాల పరిమితికి సంబంధించిన అంశాలపై మాత్రమే గతంలో ధర్మాసనం స్టే ఇచ్చింది.అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాత్రం స్టే ఇవ్వడానికి గతంలో సుప్రీం నిరాకరించింది.







