'అక్రమ సంబంధం' తప్పు కాదంట...సుప్రీమ్ కోర్ట్ సరికొత్త నిర్ణయం.! ఇది కరెక్ట్ అంటారా.?

వివాహితుడైన వ్యక్తి, వివాహం చేసుకున్న మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.వివాహం రద్దు చేసుకోవడానికి మాత్రం దీన్ని కారణంగా చూపించవచ్చని పేర్కొంది.

 Supreme Court Strikes Down About Illegal Affairs-TeluguStop.com

లింగ సమానత్వాన్ని ఉల్లంఘిస్తున్నదంటూ ఐపీసీ సెక్షన్ 497ను సుప్రీం కొట్టేసింది.చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ చారిత్రక తీర్పును వెలువరించడం గమనార్హం.

ఇష్ట‌పూర్వ‌క శృంగారం నేరం కాదు అని కోర్టు చెప్పింది.ఈ 497 సెక్షన్ భార్యలను తమ భర్తల ఆస్తులుగా చూస్తున్నదని, ఇది కచ్చితంగా వివక్షే అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

వ్యభిచారం కారణంగానే ఎక్కువగా విడాకులు అవుతున్నాయని జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు.చట్టం పేరుతో మహిళ వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లకూడదని ధర్మాసనం పేర్కొంది.సెక్షన్ 497లోని అంశాలు ఏకపక్షంగా ఉంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది.నైతిక విలువల కంటే ప్రేమతో కూడిన విలువలకే సర్వోన్నత న్యాయస్థానం ప్రాధాన్యత ఇచ్చింది.

అంతేకాదు ఒక పెళ్లైన వ్యక్తి మరొకరి భార్యతో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడితే ఇద్దరినీ జైలులో పెట్టరాదని కోర్టు సూచించింది.మొత్తానికి సెక్షన్ 497 వివక్షపూరితంగా ఉందంటూ కోర్టు పేర్కొంది.

ఈ పిటిషన్‌ను ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తో పాటు నలుగురు జడ్జీలు జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు విచారించి సెక్షన్ 497 రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఏకపక్ష తీర్పును వెలువడించారు.

ఇప్పటి వరకూ ఉన్న చట్టం ప్రకారం వివాహితుడు తన భార్యతో కాకుండా మరో వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరం.తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని భార్య కేసు పెడితే అతణ్ని ఐదేళ్లపాటు జైలుకు పంపొచ్చు.స్త్రీ పురుషులిద్దరూ ఇలాంటి చర్యకు పాల్పడితే.

సెక్షన్ 497 ప్రకారం కేవలం పురుషుణ్ని మాత్రమే శిక్షించే వీలుంది.దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

వివాహేతర సంబంధంలో ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నప్పుడు సెక్షన్ 497 చట్టబద్ధం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఒక వివాహితుడు వితంతువుతో లేదా పెళ్లికాని అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకోవడం అడల్టరీ కిందకు రాదు.

అడల్టరీ అనేది శిక్షార్హమైన నేరం కాదు, కానీ ఆ కారణంతో విడాకులు తీసుకోవచ్చని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు.వివాహేతర సంబంధం కారణంగా భాగస్వామి ఆత్మహత్యకు పాల్పడితే.

దానికి సాక్ష్యం చూపించగలిగితే.ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణంగా కేసు నమోదు చేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube