పతంజలి సంస్థకు( Patanjali Company ) అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలకు వ్యతిరేకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించారని సుప్రీంకోర్టు ( Supreme Court )నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పతంజలి వైద్య ఉత్పత్తులను ప్రచారం చేయకుండా ధర్మాసనం నిషేధించింది.పతంజలి ప్రకటనలపై కేంద్రం కళ్లు మూసుకుని కూర్చుందా అంటూ న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తప్పుడు ప్రకటనల విషయంలో జాప్యం వద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.







