లెఫ్టినెంట్ గవర్నర్కు కు ఢిల్లీ ముఖ్యమంత్రి కి మధ్య రగడ కు సుప్రీంకోర్టు( Supreme Court ) ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక్కడ పాలనాధికారాలు ఎవరివి? అన్న ప్రశ్నకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.ఢిల్లీ( Delhi ) కేంద్రపాలిత ప్రాంతం కావడంతో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన సంబంధిత విషయాలలో తమకు ఇబ్బందులు కలగ చేస్తున్నారని, బిజెపి గవర్నర్ ని అడ్డుపెట్టుకొని తమను ఇబ్బందులు పెడుతున్నారని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( CM Aravind Kejriwal ) చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు పోలీసు వ్యవస్థ మొదలుకొని సాధారణ పరిపాలన వ్యవస్థ వరకు అన్ని అధికారులను లెఫ్ట్ నుండి గవర్నర్ చెలాయిస్తున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ .ప్రధాని మోదీపై ప్రత్యక్ష ఆరోపణలు చేస్తూ రాజకీయంగా వారికి సవాల్ చేస్తున్న కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టడానికి లెఫ్టినెంట్ గవర్నర్ ను వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరడంతో ఏసీబీ విచారణ కమిషన్ లాంటివి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటాయని ఇంతకుముందు ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది అయితే పరిపాలన సంబంధిత విషయాలలో అధికారం మీద వారికి ఏకాభిప్రాయం రాక విస్తృత ధర్మాసనానికి కేసుని బదిలీ చేసింది.ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంపై ఏకాభిప్రాయ తీర్పుని ప్రకటించింది.

కేవలం శాంతి భద్రతలు మాత్రమే లెఫ్ట్నెంట్ గవర్నర్ చేతిలో ఉంటాయని పరిపాలనాధికారాలన్నీ ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ప్రభుత్వాలకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది.దీనితో లెఫ్టినెంట్ గవర్నర్ పై ఢిల్లీ ప్రభుత్వం పై చేయి సాధించినట్లు అయింది.ప్రభుత్వ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున ఇకపై పరిపాలన సంబంధిత విషయాలలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు స్వేచ్ఛ దొరికినట్లు అయింది .ఏది ఏమైనా శాసన వ్యవస్థలు ఒకదానితో ఒకటి ఘర్షణాత్మక వైఖరిని అవలంబించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని చెప్పవచ్చు.తమ రాజకీయ ఈగోలకు శాసన వ్యవస్థలను వాడుకోవటానికి రాజకీయ పార్టీలు ఇప్పటికైనాస్వస్తి చెబుతాయని ఆశిద్దాం.







