సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చిత్రం 28 ఏప్రిల్,2023 లో విడుదల

28 ఏప్రిల్,2023 వేసవి లో చిత్రం విడుదల సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కు ఇది 28 వ చిత్రం కావడం, చిత్రం విడుదల తేదీ కూడా 28 వ తేదీ కావడం విశేషం నేడు విడుదల తేదీ తో ప్రచార చిత్రం విడుదల సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో,టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాకృష్ణ ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న భారీ,ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతోంది ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సరసన అందం, అభినయం కలబోసిన తార ‘పూజాహెగ్డే‘ మరోసారి జతకడుతుండగా, మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్ ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

 Superstar Mahesh Babu #ssmb28, , To Hit Theatres On April 28, 2023 , Superstar-TeluguStop.com

రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త అభిమానుల లో ఆనందోత్సాహాలు కలిగించింది.అదే చిత్రం విడుదల తేదీ.28 ఏప్రిల్,2023 వేసవిలో విడుదల అయ్యే ఈ చిత్రానికి సంబంధించి ప్రచార చిత్రం ను విడుదల చేసారు ఈరోజు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్.సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కు ఇది 28 వ చిత్రం కావడం, చిత్రం విడుదల తేదీ కూడా 28 వ తేదీ కావడం తో ఈ వార్త విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్.ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే.ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్పెష‌ల్ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి నిర్మాత‌: ఎస్.రాధాకృష్ణ‌(చిన‌బాబు), ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube