సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమాను ప్రకటించి అదే జోష్ లో పూర్తి చేస్తున్నాడు.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ”SSMB28”.
ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడం కోసం మహేష్ రాత్రి పగలు కష్ట పడుతున్నాడు.అందుకే షెడ్యూల్స్ గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు నిర్మాత ఇటీవలే అఫిషియల్ గా తెలిపాడు.

అయితే ఇదే డేట్ కు మహేష్ బాబు తన సినిమాతో వస్తే క్లాష్ తప్పదని అంటున్నారు.లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే రోజున బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.ఈ సినిమాతో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా కూడా ఆగస్టు 11నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

ఇలా మహేష్ బాబు సినిమాకు ఇద్దరి స్టార్ హీరోల నుండి గట్టి పోటీ అయితే ఉండనుంది.మరి ఈ విషయంలో మహేష్ బాబు అండ్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.అయితే రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాల రిలీజ్ డేట్ విషయాల్లో కూడా మార్పులు రావడం ఖాయం.
చూడాలి చివరికి ఎవరు తగ్గుతారో.ఎవరు అదే రిలీజ్ డేట్ కు రిలీజ్ చేస్తారో.







