సూపర్ స్టార్ మహేష్ నటించిన ఏ సినిమా ఎంత కలెక్షన్లు సాధించిందో తెలుసా?

తక్కువ సినిమాలతోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే.రాజకుమారుడు సినిమాతో హీరోగా మహేష్ బాబు సినీ కెరీర్ మొదలైంది.

 Super Star Mahesh Babu Cinemas Collections Details Here Goes Viral , Interestin-TeluguStop.com

రాజకుమారుడు సినిమా పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.ఆ తర్వాత మహేష్ యువరాజు సినిమాలో నటించగా ఈ సినిమా 4.5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి యావరేజ్ గా నిలిచింది.

అప్పట్లో వరుస విజయాలతో జోరుమీదున్న బి.గోపాల్ డైరెక్షన్ లో మహేష్ మూడో సినిమా తెరకెక్కగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా 2.2 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.మురారి 7 కోట్ల రూపాయలు, టక్కరిదొంగ 5 కోట్ల రూపాయలు, బాబీ 2 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.

నిజం రూ.8 కోట్లు, నాని రూ.4 కోట్లు, అర్జున్ రూ.13 కోట్లు కలెక్షన్లను సాధించింది.అతడు రూ.17 కోట్ల కలెక్షన్లను సాధించగా పోకిరి సినిమాకు ఏకంగా రూ.40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.12 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.సైనికుడు రూ.18 కోట్లు, అతిథి రూ.18 కోట్లు, ఖలేజా రూ.19 కోట్ల కలెక్షన్లను సాధించింది.మహేష్ నటించిన దూకుడు రూ.56 కోట్ల కలెక్షన్లను సాధించడం గమనార్హం.

Telugu Mahesh Babu, Rajakumarudu, Sarkaruavaari, Yuvaraju-Movie

బిజినెస్ మేన్ 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.1 నేనొక్కడినే రూ.29 కోట్లు, ఆగడు రూ.34 కోట్లు, శ్రీమంతుడు రూ.85 కోట్లు, బ్రహ్మోత్సవం రూ.36 కోట్లు కలెక్షన్లను సొంతం చేసుకుంది.స్పైడర్ రూ.55 కోట్లు, భరత్ అనే నేను రూ.100 కోట్లు, మహర్షి రూ.100 కోట్లు, సరిలేరు నీకెవ్వరు రూ.138 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.సర్కారు వారి పాటకు ఇప్పటివరకు 108 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube