కృష్ణ. అందరు అయన గురించి, చనిపోయిన క్షణం గురించి చాలానే మాట్లాడుతున్నారు.
అన్ని పత్రికలూ స్పెషల్ కవరేజిలు, ప్రముఖుల పరామర్శలతో మమ అనిపించేసాయి.కానీ కృష్ణ గుండెల్లో ఎన్నో నిజాలు ఆయనతో పాటే ఇప్పుడు చచ్చిపోయాయి.
అయన 80 ఏళ్ళ జీవితంలో వ్యక్తిగత, సినిమా, రాజకీయాలను సపరేట్ గా చూడాలి.ముఖ్యంగా రాజకీయాల్లో ఆయనకు మంచి ఆసక్తి ఉండేది.
టాలీవుడ్ కాంగ్రెస్ పక్షం, కాంగ్రెస్ వ్యతిరేఖ పక్షం అంటూ రెండు వర్గాలుగా విడిపోయింది.మొదటి నుంచి అయన కాంగ్రెస్ సానుభూతి పరుడు.
ఇక తెలుగు వాడి ఆత్మగౌరవం అంటూ ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎం కుర్చీ ఎక్కి కూర్చున్నాడు.
ఒక వైపు టీడీపీ పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ని కడిగేస్తూ దావనం లా దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి కృష్ణ నిద్ర పట్టనివ్వలేదు.
కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తూ అయన రాష్ట్రం అంత తిరిగాడు.ఒక చోట ఎన్టీఆర్ అభిమానులు రాళ్ల దాడి కూడా చేస్తే అయన కంటికి తీవ్రమైన రక్తస్రావం అయ్యింది.
ఇక ఆంధ్ర మొత్తం మీడియా కూడా ఎన్టీఆర్ కి సపోర్ట్ చేసింది.ముఖ్యంగా ఈనాడు రోజు ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పై బురద జల్లుతూ రాస్తున్న వార్తలపై కృష్ణ గారు భగ్గుమన్నారు.
ఈనాడు దుస్తున్న కత్తులపై అయన బాహాటం గానే దుమ్మెత్తి పోశారు.ఒక రోజు కాంగ్రెస్ మీటింగ్ కి మూడు లక్షల మంది హాజరు కాగా, కేవలం 1500 మంది వచ్చారంటూ ఈనాడు చెప్పడం నిజంగా సిగ్గు చేటు అంటూ వ్యాఖ్యలు చేసారు.
ఈనాడు పూర్తిగా జర్నిలిజానికి మచ్చ అంటూ కృష్ణ చేసిన వ్యాఖ్యలు సైతం బాగా వినిపించాయి.ఇలా చెప్పడానికి ఆయనకు ఎలాంటి భయం లేదు.లోపల ఏది దాచుకునే టైపు కాదు కృష్ణ.అందుకే కోపాన్ని కక్కేసాడు.ఆనాడు ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు కోసం ఈనాడు పత్రిక ఎప్పుడు పాజిటివ్ గా వార్తలు రాస్తూనే వచ్చింది.ఇక ఎన్టీఆర్ సొంత అల్లుడి చేతిలో వెన్ను పోటు కి గురయినప్పుడు ఈనాడు మళ్లి బాబు పక్షాన్నే నిలబడి ఆయనకు సపోర్ట్ చేస్తూ స్పెషల్ స్టోరీ లను ప్రచురించింది.
అయినా కూడా కృష్ణ రాజకీయం వదిలేసినా ఈనాడు తో మంచి సంబంధాలని నెరిపారు.రామోజీరావు మనవరాలి పెళ్ళికి కృష్ణ గారు కూడా హాజరయ్యారు.