‘డై హార్డ్ ఫ్యాన్’ నుంచి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేసిన పరుగే పరుగు పాటకు సూపర్ రెస్పాన్స్..

ప్రియాంక శ‌ర్మ‌, శివ ఆల‌పాటి జంట‌గా, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, నోయ‌ల్ ముఖ్య‌పాత్రల్లో శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం డై హార్డ్ ఫ్యాన్.ఈ చిత్రంలో ప్రియాంక శర్మ హీరోయిన్ పాత్ర‌లో నటిస్తున్నారు.

 Super Response To The Song paruge Parugu From Die Hard Fan Released By Star Hero-TeluguStop.com

హీరోయిన్‌ కి డైహ‌ర్ట్ ఫ్యాన్ గా శివ ఆల‌పాటి న‌టిస్తున్నాడు.హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ.ఇందులో షకలక శంకర్ బేబమ్మ.రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ పాత్రలో చాలా బాగా న‌టించి మొప్పిచారు.

ష‌క‌ల‌క శంక‌ర్ పాత్ర ఆద్యంతం న‌వ్విస్తుంది.సినిమాలో న‌టించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అంద‌రికి తెలుసు.

అలాంటి ఓ అభిమాని త‌ను అభిమానించే హీరోయిన్‌ని క‌ల‌వాల‌నుకుంటాడు.అనుకోకుండా హీరోయిన్ క‌లిస్తే ఆ రాత్రి ఏం జ‌రిగింద‌నేది ఈ చిత్ర ముఖ్య క‌థాంశం.

ఈ చిత్రంలో అన్ని పాత్ర‌లు కూడా హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి.ద‌ర్శ‌కుడు అభిరామ్ M ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా ఈ చిత్రాన్ని చిత్రీక‌రించాడు.

నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మిచారు.క‌థ లో మ‌లుపులు ప్రేక్ష‌కుడ్ని థ్రిల్ చేస్తాయి.

ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది.

మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు.తాజాగా ఇందులో పరుగే పరుగు పాటను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుద‌ల చేశారు.

ఈ పాట చాలా అద్బుతంగా ఉందని.సౌండింగ్ అదిరిపోయిందని చెప్పారు రకుల్.ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.

నటీనటులు:

ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నొయ‌ల్ తదితరులు

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: అభిరామ్ M,బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్,నిర్మాత: చంద్రప్రియ సుబుధి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి మాటలు: సయ్యద్ తేజుద్దీన్, సంగీతం: మధు పొన్నాస్, సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి, ఎడిట్ VFX – తిరు B ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి , PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube