ఈ ఒక్క ప్యాక్ వేసుకుంటే హెయిర్ ఫాల్‌కు ఈజీగా అడ్డుక‌ట్ట వేయొచ్చు!

ప్ర‌స్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మంది హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌తో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతున్నారు.

ప్ర‌తి రోజు వెంట్రుక‌లు రాలిపోతూ జుట్టు ప‌ల్చ‌బ‌డిపోతుంటే.

అందం త‌గ్గిపోతుంద‌ని కొంద‌రు, పెళ్లి కాద‌ని మ‌రికొంద‌రు టెన్ష‌న్ ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే త‌మ‌లోని ఆత్మ‌విశ్వాసాన్ని కోల్పోతారు.

ప‌నిపై ఏక్ర‌త పెట్ట‌లేక కోరుకున్న రంగంలో రాణించ‌లేక వెనుకబడిపోతుంటారు.ఈ జాబితాలో మీరూ ఉన్నారా? అయితే ఇక‌పై అస్స‌లు బాధ‌ప‌డ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ ప్యాక్‌ను వారంలో ఒక్క‌సారి వేసుకుంటే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌కు ఈజీగా అడ్డుక‌ట్ట వేయొచ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హెయిర్ ప్యాక్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు, మూడు బాదం ప‌ప్పులు వేసుకుని వాట‌ర్ పోసి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.ఉద‌యాన్నే నువ్వుల‌ను, బాదం ప‌ప్పుల‌ను రెండు సార్లు వాట‌ర్‌తో క‌డ‌గాలి.

ఆ త‌ర్వాత బాదం ప‌ప్పుల‌కు ఉన్న తొక్క‌ను తొల‌గించి ప‌క్క‌న పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక క‌ప్పు ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు, నాన‌బెట్టుకున్న నువ్వులు, బాదం ప‌ప్పులు, గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుని జ్యూస్‌ను స‌ప‌రేట్ చేయాలి.

ఇక ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల మందారం పువ్వుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల అర‌టి పండు గుజ్జు, రెండు టేబుల్ స్పూన్ల ఆముదం వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో ఒక్క‌సారి చేస్తే ఖ‌చ్చితంగా జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు