పల్లెటూరి బాట పట్టు.. సినిమా హిట్టు కొట్టు !

ఒకప్పుడు మూస దొరణితో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా తెలుగు సినీ ఇండస్ట్రీ. ప్రస్తుతం వైవిధ్యమైన కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.

 Super Hit Village Backdrop Movies Rangastalam Srimanthudu Pushpa Narappa Details-TeluguStop.com

ఇక గతంలో వాస్తవాలకు దూరంగా సినిమాలు రూపొందించే మేకర్స్ ఇప్పుడు రియాలిటీకి దగ్గరగా మూవీస్ ను తెరకెక్కిస్తున్నారు.మూవీస్ లో రియాలిటీ లేకపోతే చూసే ఆడియన్స్ కూడా పెదవి విరుస్తున్నారు.

దాంతో మూవీ మేకర్స్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో వైవిధ్యం చూపిస్తూ రియాలిటీకి దగ్గరగా పక్కా కమర్షియల్ హంగులతో మూవీస్ ను రూపొందిస్తూ ఒక్క తెలుగు ఆడియన్స్ నే కాకుండా ఇండియా వైడ్ గా సినీ ప్రియులను అలరిస్తున్నారు.ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రియాలిటీకి దగ్గరగా ఉండే రూరల్ బ్యాక్ డ్రాప్ ట్రెండ్ నడుస్తోంది.

పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలన్నీ కూడా సంచలన విజయాలను నమోదు చేస్తూ మేకర్స్ కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.రూరల్ బ్యాక్ డ్రాప్ కు కాస్త కమర్షియల్ టచ్ ఇస్తూ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతున్నారు మేకర్స్.ఈ మద్యకాలంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ( Village backdrop movies ) వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన మూవీస్ పై ఓ లుక్కేద్దాం !

1.రంగస్థలం

Telugu Allu Arjun, Mahesh Babu, Trends, Ppa, Pushpa, Ram Charan, Rangastalam, Sr

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్( Ram charan ) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ” రంగస్థలం ” ( Rangasthalam ) ఈ మద్యకాలం లో రూపొందుతున్న విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ కు మూల కారణం అని చెప్పవచ్చు.ఈ మూవీలో చూపిన విలేజ్ సెట్స్, కల్చర్, నటి నటుల ఫర్ఫామెన్స్ సినీ ప్రేక్షకుడిని 1980 లోకి తీసుకెళుతుంది.ఈ మూవీలో పాత్రల మద్య వచ్చే సంభాషణలు, పాత్రల వేషధారణ పల్లె ప్రజలను ప్రతిబింభిస్తుంది.దాంతో సినీ అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ సాధించింది.

2.శ్రీమంతుడు

Telugu Allu Arjun, Mahesh Babu, Trends, Ppa, Pushpa, Ram Charan, Rangastalam, Sr

మహీష్ బాబు( Mahesh babu ) హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది.గ్రామంలో పెత్తందారుల కారణంగా ఎంతో మంది ప్రజలు ఆ గ్రామాన్ని విడిచిపోట్టి పోగా.హీరో ఆ పెత్తందారీ వ్యవస్థను ఎలా నిర్మూలించి.గ్రామాన్ని ఎలా అభివృద్ది చేశాడనే కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఓ క్లాసిక్ హిట్ గా నిలిచి మహేశ్ బాబు కెరియర్ లోనే గుర్తిండిపోయే మూవీస్ జాబితాలో ఒకటిగా నిలిచింది…

3.పుష్ప

Telugu Allu Arjun, Mahesh Babu, Trends, Ppa, Pushpa, Ram Charan, Rangastalam, Sr

సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది.అల్లు అర్జున్ హీరోగా నటింకిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధింకింది.పల్లెటూర్లో కూలి పని చేసుకుంటూ ఉండే ఓ యువకుడు స్మగ్లింగ్ కింగ్ ఎలా అయ్యాడనే కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

4.నారప్ప

Telugu Allu Arjun, Mahesh Babu, Trends, Ppa, Pushpa, Ram Charan, Rangastalam, Sr

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ మూవీ కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలోనే తెరకెక్కింది.శ్రీకాంత్ అడ్డాల ధర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తమిళ్ అసురన్ మూవీకి రీమేక్.ఓ గ్రామంలో పెత్తందారుల కారణంగా నష్టపోయిన ఓ తండ్రి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు అనే కథాంశంతో రూపొందిన ఈ మూవీ ఓటిటీలో రిలీజ్ అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇంకా ప్రస్తుతం పుష్ప 2, దసరా వంటి మరికొన్ని సినిమాలు కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నాయి.

ఈ మూవీస్ కూడా హిట్ అయితే.పల్లెటూరి కల్చర్ తో మరికొన్ని సినిమాలు రావడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube