వారంలో ఒక్కసారి ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలమన్న రాలదు!

సాధారణంగా కొందరిలో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది చాలా అధికంగా ఉంటుంది.

పోషకాల కొరత, ఒత్తిడి, కాలుష్యం, పలు రకాల మందుల వాడకం, ధూమపానం, మద్యపానం, వేడి వేడి నీటితో తలస్నానం చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలుగా మారుతుంటాయి.

ఏదేమైనా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటే ఎంతగానో విలపిస్తూ ఉంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇకపై వర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను( Hair Oil ) వాడితే జుట్టు రాలమన్న రాలదు.

హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడానికి ఈ ఆయిల్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుకు స్ట‌వ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో అర గ్లాసు కొబ్బరి నూనె,( Coconut Oil ) అర గ్లాసు నువ్వుల నూనె వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, మూడు రెబ్బల కరివేపాకు, ప‌ది తులసి ఆకులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ ముక్కలు వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి కనీసం ప‌ది నిమిషాలు అయినా మసాజ్ చేసుకోవాలి.తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.కుదుళ్ళు బలోపేతం అవుతాయి.

ఫ‌లితంగా జుట్టు రాలడం అనేది క్రమంగా అదుపులోకి వస్తుంది.పైగా ఈ ఆయిల్ ను వారంలో ఒక్కసారి వాడితే జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.

మరియు చుండ్రు సమస్య సైతం దూరం అవుతుంది.కాబట్టి ఎవరైతే అధిక హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు