ఈ ప్రకృతిలో ఎన్నో రకాల అందాలు దాగున్నాయి.అందులో సూర్యోదయం ప్రకృతి ప్రసాదించిన అందమైన వరం.
పొద్దున లేచి కొండల నడుమ గుండ్రంగా.ఎర్రగా వస్తున్న సూర్యుడిని చూస్తే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.
ఎందుకంటే అందమంతా సూర్యుడి దగ్గరే ఉండిపోయిందేమో అనిపించేంతలా మనల్ని మైమరిపిస్తుంది ఆ పర్యవసానం.ఇలా మెలిమెల్లిగా ఉదయించే సూర్యుడికి చెందిన వీడియోలు, ఫొటోలు ఎప్పటికీ అందంగానే ఉంటాయి.
ప్రకృతి ప్రేమికులకు అయితే ఇలాంటి ఫొటోలు పండుగలాగా అనిపిస్తాయి.
అయితే ఎప్పుడైనా భూమ్మీద నుంచే సూర్యోదయం అంటే చూస్తున్నాం గానీ.
అంతరిక్షంలో నుంచి సూర్యోదయాన్ని చూస్తే ఇంకెంత అందంగా ఉంటుంది కదా.ఊహించడానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంటే.
ఇంక చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి.మీరు విన్నది నిజమేనండోయ్.
ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.ఇవి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే వీటిని చూసిన వారంతా కూడా వావ్ అనేస్తున్నారు.జనవరి 1న ఈ ఫొటోలను స్పేస్ నుంచి తీశారు.
వాస్తవానికి కొత్త ఏడాదికి స్పేస్ లో ఉండాలని కొందరు వ్యోమగాములు ఇలా అంతరిక్షానికి వెళ్లగా.వారు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఫొటోలు తీశారు.
కాగా ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో పోస్టు చేయడంతో నేచర్ లవర్స్ అంతా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.ఇంత అందంగా ఉన్నాయేంటి అంటూ కామెంట్లు కూడా పెడతున్నారు.ఇప్పటి వరకు భూమ్మీద నుంచి చూడమే తప్ప.స్పేస్ నుంచి చూడటం ఇదే మొదటిసారి అంటూ చాలామంది ఫీల్ అవుతున్నారు.చూడగానే వావ్ అనిపించేలా ఉన్న ఆ అందమైన ఫొటోలను మీరు కూడా ఆలస్యం చేయకుండా చూసేయండి.చూసి మీ కామెంట్ ఏంటో కూడా తెలియజేయండి.