'జిన్నా' ఫస్ట్ లుక్ లో సన్నీ లియోన్ పోస్ట‌ర్..

బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఈ చిత్రయూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు.

 Sunny Leone Poster From Manchu Vishnu Ginna Movie Details, Sunny Leone ,poster ,-TeluguStop.com

ఈ చిత్రంలో సన్నీ లియోన్ పాత్ర ఏమిటి, ఆమె ఎలా నటిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంద‌ర్భంలో కొత్త లుక్ సోషల్ మీడియాలో విప‌రీత‌మైన‌ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రచయిత అయిన‌ కోన వెంకట్ అందించారు.

ఈ చిత్రంలో హీరో మంచు విష్ణు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన‌ మరో డైన‌మిక్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

తెలుగు తమిళం, మలయాళం, హిందీ అనే నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న జిన్నా రోజురోజుకు మంచి బజ్‌ని సోంతం చేసుకుంటుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో స‌న్నీ రీల్స్, విష్ణు, ఆయ‌న బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించారు.‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ప‌ని చేస్తున్నట్లు సమాచారం.త‌న సంగీతంతో తెలుగు ప్రేక్ష‌కుల‌నీ ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube