ప్రస్తుతం వింగ్స్ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఆ పుస్తకంలో సన్నీ యాంజిల్ అనే 40 ఏళ్ల మహిళ తాను 20 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.
ఆ సమయంలో సన్నీకి బలవంతపు పెళ్లి చేశారట.అది కూడా మతి స్థిమితం సరిగా లేని వ్యక్తితో వివాహం చేశారట.
వివాహం చేయడంతో పాటు, ఆమె అత్త కొడుకుకు బూతు వీడియోలు చూపించి, ఇలా చేయాలంటూ ప్రేరేపించిందట.మొదటి రాత్రి రోజు తన పరిస్థితి అత్యంత దారుణమని, అతడు తనపై చేసిన అఘాయిత్యంను నేను జీవితంలో మర్చి పోలేను అంటూ ఆ భయానక సంఘటనలను వింగ్స్ పుస్తకంలో చెప్పుకొచ్చింది.
చిన్నపిల్లాడి మనస్థత్వం అయినటువంటి తన భర్తకు ఏం తెలియదని, కాని అతడి తల్లి అయిన నా అత్త మొదటి రాత్రి రోజు రూం బయట కిటికి పక్కన నిల్చుని అతడిని ప్రేరేపిస్తూ అత్యంత నీచంగా ప్రవర్తించిందని పేర్కొంది.బలవంతం చేయి, ఒప్పుకోకుంటే బట్టలు చింపు, కొరుకు, గట్టిగా పట్టుకో అంటూ ఆమె కిటికీ బయట నుండి ఇస్తున్న ఆదేశాల మేరకు అతడు నన్ను రేప్ చేశాడని సన్నీ పేర్కొంది.
ఇలాంటి అనుభవాలు మరెవ్వరికి ఎదురు కావద్దనే ఉద్దేశ్యంతోనే వింగ్స్ పుస్తకంను రాసినట్లుగా చెప్పుకొచ్చింది.చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేసుకుని అత్యంత మానసిక వేదన అనుభవించడంతో పాటు, క్రూరమైన మగాళ్లను, అత్తలను భరించలేక ఎంతో మంది అమాయకపు అమ్మాయిలు బలవుతున్నారంటూ సన్నీ తన పుస్తకంలో చెప్పుకొచ్చింది.తన వైవాహిక జీవితం నాలుగు నెలలకే ముగిసిందని, విడాకులు తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.భర్తకు దూరంగా ఉంటున్నానని తెలిసి నా అత్త నాకు కొన్నాళ్లు బోజనం కూడా పెట్టలేదనే విషయాన్ని సన్నీ చెప్పుకొచ్చింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో నా భర్తకు పెద్దగా ఏం తెలియదని, ఆయన చిన్న పిల్లాడితో సమానం అంటూ కితాబివ్వడం కొసమెరుపు.