A1 ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ లుక్.. సిక్స్ ప్యాక్‌తో రఫ్ఫాడించిన హీరో

యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల కాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు.ఆయన నటిస్తు్న్న సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే, ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

 Sundeep Kishan A1 Express First Look Poster-TeluguStop.com

వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలను వరుసబెట్టి చేస్తూ ఈ హీరో సక్సెస్ అందుకుంటున్నాడు.ఈ క్రమంలోనే సందీప్ కిషన్ తన తాజా చిత్రం A1 ఎక్స్‌ప్రెస్‌ను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

ఈ సినిమాతో హాకీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథను మనముందుకు పట్టుకొస్తున్నాడు ఈ హీరో.టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ హీరో, A1 ఎక్స్‌ప్రెస్‌తో అదిరిపోయే హిట్ కొట్టాలని కసిగా ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్న సందీప్ కిషన్, ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీతో చాలా స్లిమ్‌గా తయారయ్యాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో సందీప్ ఓ చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని, మరో చేత్తో తన జెర్సీ విప్పి పైకి ఎగరేస్తూ సంతోషంగా కనిపిస్తున్నాడు.సిక్స్ ప్యాక్ బాడీని మనకు సైడ్ నుండి చూపెట్టిన సందీప్, ఈ సినిమాలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ లావణ్య త్రిపాఠీ నటిస్తోంది.ఈ సినిమాను కొత్త దర్శకుడు డెన్నిస్ కనుకొలను డైరెక్ట్ చేస్తుండగా AA ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

హిప్‌హాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ‘సింగిల్ కింగులం’ పాట ప్రేక్షకులను అమితంగా అలరించింది.మరి సందీప్ కిషన్ కెరీర్‌లో 25వ చిత్రంగా వస్తున్న A1 ఎక్స్‌ప్రెస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube