టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.మంచి ఊపు మీద ఉన్న నాని వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ఇటీవలే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులకు ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం నాని అంటే సుందరానికి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రస్తుతం నాని తాను కమిట్ అయినా నెక్స్ట్ సినిమాల షూటింగ్స్ లో జాయిన్ అవుతున్నారు.
హీరో నాని నుంచి దాదాపుగా రెండేళ్ల తర్వాత రిలీజ్ అయిన సినిమా శ్యామ్ సింగరాయ్.ఈ సినిమాకు రాహుల్ దర్శకత్వం వహించిన తెలిసింది.
ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ పరంగా బాగానే లాభాలు తెచ్చిపెట్టింది.నాని శ్రీకాంత్ ఓదెల్ల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.
ఆ సినిమాకు దసరా అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు.ఇకపోతే అంటే సుందరానికి సినిమా కూడా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుంచి నాని క్యారెక్టర్ ను రిలీజ్ చేస్తూ ఒక టీజర్ ను వదిలారు.

నాని నటించిన అంటే సుందరానికి సినిమా జూన్ 10న విడుదల కానున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా సన్ రైజర్స్ ఈ సినిమాపై స్పందిస్తూ అంటే ఆ సుందరం జూన్ లో వస్తాడు, ఈ సుందర్ ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు అని సన్ రైజర్స్ ట్వీట్ చేసింది.ఈ విషయంపై హీరో నాని స్పందిస్తూ ఆల్ ది బెస్ట్ సుందర్.
ప్రమ్ సుందర్.ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
ఇందుకు సంబంధించి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







