ఆ సినిమాలో నటించి చాలా పెద్ద తప్పు చేశా: హీరో సుమంత్

బాలశేఖరన్ దర్శకత్వంలో నాగార్జున,సమంత హీరోలుగా తెరకెక్కిన స్నేహమంటే ఇదేరా సినిమా విడుదల అయిన విషయం తెలిసిందే.మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఫ్రెండ్స్ అనే సినిమాకు రీమేక్ గా స్నేహమంటే ఇదేరా సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

 Sumanth Interesting Comments About Nagarjuna , Sumanth , Interesting Comments ,-TeluguStop.com

రియల్ లైఫ్ లో మామ అల్లుళ్ల ను దర్శకుడు ఫ్రెండ్స్ లా చూపించడం వల్ల సినిమా ప్లాప్ అయింది అంటూ సుమంత్ కామెంట్ చేశారు.ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ఇందులో హీరోయిన్ గా భూమిక నటించగా ప్రత్యుష ఇందులో కీలక పాత్రలో నటించింది.

హీరో సుమంత్ ఒక సందర్భంలో ఈ సినిమా చేసి తప్పు చేసానని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా నిర్మాతలకు కూడా ఈ సినిమా బారి మొత్తంలో నష్టాలను మిగిల్చింది.అంతే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసు అంటూ కామెంట్ చేశారు.

ఎందుకంటే షూటింగ్ సమయంలో ఈ సినిమా చేసి తప్పు చేశాను అని అనుకున్నాను అని సుమంత్ చెప్పుకొచ్చారు.అప్పటికే సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అవ్వడంతో ఏమి చేయాలో తెలియక ఆ సినిమాలో అలాగే కంటిన్యూ చేశాను అని చెప్పుకొచ్చారు.

మొదట ప్రేమకథ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సుమంత్ ఆ తరువాత పదుల సంఖ్యలో సినిమాలు సక్సెస్ అయినప్పటికీ ఇతర హీరోలతో పోల్చుకుంటే సుమంత్ కాస్త వెనక పడ్డారు.

ఇది ఇలా ఉంటే హీరో సుమంత్ తాజాగా నటించిన చిత్రం మళ్లీ మొదలయ్యింది.సినిమా జీ5 ఓటీటి లో స్ట్రీమింగ్ కానుంది.చాలాకాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సుమంత్ కు ఈ సినిమాతో అయినా సక్సెస్ వస్తుందో రాదో చూడాలి మరి.ఇందులో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకు కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా కొద్ది రోజులలో విడుదల కానుండగా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube