స్టార్ సినిమా అయినా స్మాల్ హీరో సినిమా అయినా భారీ బడ్జెట్ అయినా మామూలు బడ్జెట్ అయినా సినిమా ఈవెంట్ అంటే చాలు సుమ అక్కడ వాలిపోవాల్సిందే.అయితే ఈమధ్య సినిమాలు థియేటర్ లో కన్నా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.
ఈ వెబ్ సీరీస్ లకు ప్రమోషన్స్ లేకుండా అవుతున్నాయి.అందుకే సుమ లేటెస్ట్ గా ఈ వెబ్ సీరీస్ ల ప్రమోషన్స్ కూడా చేస్తుంది.
రీసెంట్ గా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన యాంగర్ టేల్స్ ఈవెంట్ కి సుమ ప్రమోషన్ చేసింది.ఆ సినిమా ఈవెంట్ తో పాటుగా లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా చేసింది సుమ.
సో వెబ్ సీరీస్ లు ఎక్కువవుతున్న ఈ టైం లో వారి ఈవెంట్ లతో పాటుగా ఇంటర్వ్యూస్ కూడా చేసేలా సుమ ప్లానింగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు.అయితే సినిమాల ఈవెంట్ లకు ఇచ్చినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా వాటిలో సగం అయినా కూడా సుమకి బాగానే వర్క్ అవుట్ అవుతుంది.
అదీగాక స్టార్ సినిమాల ఈవెంట్ లో ఫ్యాన్స్ ని అలరించాలి.కానీ ఈ వెబ్ సీరీస్ ఈవెంట్ లో తను ఏం మాట్లాడినా సరే చెల్లిపోతుంది.మొత్తానికి సుమ తన యాంకరింగ్ టాలెంట్ ని వెబ్ సీరీస్ లకు కూడా పాకేలా చేసింది.