ఏపీ ప్రతిసారి సంచలనంగా మారుతున్న టాపిక్ ఏదైనా ఉందా అంటే అది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనే చెప్పాలి.హత్య జరిగి ఇప్పటికే నాలుగేళ్ళు పూర్తయిన ఇప్పటివరకు దొషులేవరేనేది మిస్టరీగానే ఉంది.
ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు ప్రస్తుతం వేగంగా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా వివేకానంద మర్డర్ లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని మొదటి నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
అంతే కాకుండా వివేకా హత్య కు వైఎస్ జగన్ మద్దతు కూడా ఉందని టీడీపీ నేతలు మొదటి నుంచి కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ విమర్శలకు బలం చేకూర్చేలా.
వైఎస్ జగన్ కూడా ఇంతవరకు వివేకా హత్యపై స్పందించడం లేదు.ఎన్నికల ముందు వివేకా హత్యకు సంబంధించి నానా హైరానా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత మాత్రం ఈ కేసును నీరుగార్చే పని చేస్తున్నారనే భావన చాలమందిలో ఉంది.

ఎందుకంటే వివేకా కూతురు సునీత రెడ్డి. జగన్ సర్కార్ తో సంబంధం లేకుండా కోర్టుకు వెళ్ళడం కోర్టు కూడా ఈ కేసు విచారణను తెలంగాణ సిబిఐ కి అప్పగించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.ప్రస్తుత తెలంగాణ సిబిఐ ఈ కేసును ఎంతో సీరియస్ గా తీసుకొని విచారణ సాగిస్తుండగా.ఇప్పటికే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని రెండు సార్లు విచారించింది.
ఇక మరోసారి విచారణకు హాజరు కావాలని ( మార్చి 6 న ) నోటీసులు జారీ చేసింది.అయితే ముందస్తు కార్యక్రమాల వల్ల ఆ రోజు విచారణకు హాజరు కాలేనని, మార్చి 10,11 తేదీల్లో హాజరు అవుతానని అవినాష్ రెడ్డి తెలంగాణ సిబిఐ కి విన్నవించుకున్నారు.
ఇక రేపు ( మార్చి 11 ) విచారణకు హాజరు కావాల్సి ఉండగా.ట్విస్ట్ ఇస్తూ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

తనపై సిబిఐ ఏ విధమైన బలవంతపు చర్యలు తీసుకోకూడదని, ఈ కేసులో ఏ4 గా ఉన్న దస్తగిరి చెప్పిన మాటల ఆధారంగానే తెలంగాణ సిబిఐ తనను టార్గెట్ చేస్తోందని, రేపు విచారణను న్యాయవాది సమక్షంలో చేయడమే కాకుండా ఆడియో, వీడియో రికార్గింగ్ కూడా చేయాలని అవినాష్ రెడ్డి కోర్టు లో పిటిషన్ వేశారు.దీంతో వివేకా హత్య కేసు మరింత ఆసక్తికరంగా మారింది.అవినాష్ రెడ్డి అరెస్ట్ భయంతోనే కోర్టును ఆశ్రయించారని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఒకవేళ ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఏపీ సిఎం జగన్ కు కూడా ముప్పే అనే వాదన నడుస్తోంది.
ఎందుకంటే అవినాష్ రెడ్డి గత విచారణలో భాగంగా ఆయన పోన్ కాల్స్ ను పరిశీలించిన సిబిఐ.వైఎస్ జగన్, మరియు వైఎస్ భారతి లకు పోన్ కాల్స్ వెళ్ళినట్లు వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో నెక్స్ట్ జరగబోయే పరిణామాలు సంచలనాలకు దారి తీసే అవకాశం ఉంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.







