168 నెలల ప్రేమ.. 730 వారాల ఆనందం.. సుకుమార్ భార్య పోస్ట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

క్రియేటివ్ జీనియస్ సుకుమార్( Director Sukumar ) గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే.తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

 Sukumar Wife Thabitha Shocking Post Goes Viral In Social Media Details, Thabitha-TeluguStop.com

తన శిష్యులు కూడా కెరీర్ పరంగా సక్సెస్ అయ్యేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటారు.విరూపాక్ష ( Virupaksha ) సినిమా పాజిటివ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడానికి సుకుమార్ స్క్రీన్ ప్లే కారణమనే సంగతి తెలిసిందే.

ఏడు నెలల పాటు కష్టపడి సుకుమార్ చెప్పిన మార్పులు చేశామని విరూపాక్ష దర్శకుడు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.సుకుమార్ తన శిష్యులకు ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటారని స్కూల్ టీచర్ తరహాలో పాఠాలు బోధిస్తారని సమాచారం.

అయితే ఈరోజు సుకుమార్, తబితల పెళ్లి రోజు కావడం గమనార్హం.లెక్కల మాస్టార్ భార్య సాధారణంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబితే అందులో కిక్కేం ఉండదు.

అందుకే సుకుమార్ భార్య( Sukumar Wife ) లెక్కల మాస్టర్ సుకుమార్ కు నచ్చే స్టైల్ లో పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు.తబిత ( Thabitha )లెక్కలు వేస్తూ చెప్పిన ఈ విషెస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.తబిత తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో 14 సంవత్సరాల తబితా సుకుమార్ వైవాహిక జీవితం ఈక్వల్ టూ 730 వారాల ఆనందం.5113 రోజుల విధేయత. 122721 గంటల అవగాహన చేసుకునే తత్వం అని చెప్పుకొచ్చారు.

7363288 నిమిషాల పట్టుదల, 441797328 సెకన్ల నిరంతర నిబద్ధత అని పేర్కొన్నారు.14 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని ఆమె సింపుల్ గా ఈ విధంగా వెల్లడించారు.సుకుమార్, తబిత కలకాలం అన్యోన్యంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 ( Pushpa 2 )సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించి సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సుకుమార్ భార్య పోస్ట్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube