తెలుగు ప్రేక్షకులకు ఈరోజు చిరంజీవి( Chiranjeevi ) హీరోయిన్ సుహాసినిల ( Suhasini )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.
మోస్ట్ పాపులర్ జోడిగా కూడా అప్పట్లో వీళ్ళు రాణించారు.వీరిద్దరి కాంబినేషన్లో మంచు పల్లకి, మగమహారాజు, చాలెంజ్,చట్టబ్బాయి, రాక్షసుడు,కిరాతకుడు, మరణ మృదంగం,ఆరాధన ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి.
అలా వీరు నటించిన సినిమాలు చాలా వరకు హిట్ అవ్వడంతో హిట్టు పెయిర్ గా కూడా నిలిచారు అయితే ఈ ఇద్దరి మధ్య అనుబంధం గొడవలతో ప్రారంభమైందట.తాజాగా ఆ విషయాన్ని సుహాసిని బయటపెట్టింది.
సుహాసిని మొదట్లో సినిమాలకి అస్టిస్టెంట్‌గా పనిచేసింది.

ఆ తర్వాత హీరోయిన్ అయ్యింది.ప్రారంభంలో చిరు కాలి అనే ఒక తమిళ సినిమాలో నటించారు.ఆ మూవీకి సుహాసిని అసిస్టెంట్‌గా పనిచేసిందట.
ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవికి కొత్తగా పెళ్లైందట, తమిళం రాకపోవడంతో ఒంటరిగా మూలకు కూర్చున్నాడట.అది చూసిన సుహాసిని అసిస్టెంట్లని అడగ్గా ఆయన తెలుగు హీరో, తమిళం రాదు అని చెప్పారట.
దీంతో తనే చిరు వద్దకు వెళ్లి మాట్లాడిందట.కట్ చేస్తే ఆమె రెండో సినిమా చిరంజీవితో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది.
అదే మంచు పల్లకి( Manchu pallaki ).అది చూసి చిరు ఆశ్చర్యపోయారట.ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య గొడవైందట.ఆ గొడవేంటో గుర్తు లేదుగానీ, ఈ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువ అనే భావని చిరంజీవిలో ఉండేదన్నారట.

ఆ తర్వాత ఎయిర్ ఇండియా లో ప్రయాణిస్తున్నప్పుడు చిరంజీవి, సుహాసిని పక్కనే వచ్చి కూర్చున్నారట.వచ్చి ఎక్కడ, ఎన్నిరోజులు ఉంటావని అడిగి, అంతా అయిపోయాక, ఏదైనా అవసరం ఉన్నా, ఏమన్నా కావాలనిపించినా, ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే తనని అడక్కు అని చెప్పి నిద్ర పోయారట చిర.దీంతో ఏంటి ఈయన ఏం మాట్లాడలేదు, ఏం హెల్ప్ అడగొద్దు అంటున్నారు, నిద్రపోయారు అని మనసులో అనుకుందట సుహాసిని.ఆయన లాంటి సెన్సాఫ్ హ్యూమర్ ఎవరికీ ఉండదని తెలిపింది సుహాసిని.
ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది.ఒక తమిళ సినిమాలో సుహాసిని, సుమలత కలిసి పనిచేస్తున్నారట.
ఆ సమయంలో నువ్వు చిరంజీవితో సినిమా చేస్తున్నావట అని ఆమె సుహాసిని అడిగిందట.అయితే ఏంటి? అన్నదట.దీంతో ఆయన తెలుగులో గ్రేట్ అప్‌కమింగ్ స్టార్, మంచి యాక్టర్, తమిళంలో కమల్ హాసన్ ఎలాగో, తెలుగులో ఆయన అలాగా అన్నందట.అంతా విని అయ్యో చూడ్డానికి విలన్ లా ఉన్నారే అంటూ కౌంటర్ ఇచ్చిందట సుహాసిని.
అంతేకాదు సుమలత ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పిందట.ఆ నెక్ట్స్ డే షూటింగ్‌కి వచ్చినప్పుడు విలన్ తో ఎవరు యాక్ట్ చేస్తారు? విలన్ ఫేస్‌తో ఎవరు యాక్ట్ చేస్తారని గంభీరంగా మాట్లాడారట.దీంతో ఏం చేయాలో అర్థం కాలేదని, ఎంతో ఆపాలజీ చెప్పినా వినలేదని, బాగా ఆడుకున్నాడని వెల్లడించింది సుహాసిన.అలా గొడవలతో తమ ఫ్రెండిషిప్ ప్రారంభమైందని వెల్లడించింది.అవన్నీ ఇప్పుడు ఎంతో స్వీట్ మెమరీస్‌గా మిగిలాయని చెప్పుకొచ్చింది సుహాసిని.