జగన్ సూచన.. ఆ ఇద్దరి ఆచరణ !

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పొంగులేటి, జూపల్లి ( Ponguleti, Jupally )వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే.కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ కు గురయ్యారు.

 Suggestion Given By Jagan , Jagan, Ponguleti, Jupally, Brs, Ap Politics, Telanga-TeluguStop.com

ఆ తరువాత నుంచి ఈ ఇద్దరు ఏ పార్టీలో చేరతారు ? ఎటు వైపు అడుగులేస్తారు ? వీరి ప్రభావం బి‌ఆర్‌ఎస్( Brs ) పై ఎంతమేర ఉంటుంది ? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.అయితే ఆ మద్య వీరిద్దరు బీజేపీలో చేరే అవకాశం ఉందనే వార్తలు గట్టిగా వినిపించాయి.

బీజేపీ నేతలు వీరిద్దరితో మంతనాలు జరుపుతున్నారని, త్వరలోనే పొంగులేటి మరియు జూపల్లి కాషాయ కండువా కప్పుకోబోతున్నారని ఇలా రకరకాల వార్తలు చక్కర్లుకొట్టాయి.

Telugu Ap, Brs Ponguleti, Cmjaganmohan, Rahul Gandhi, Telangana, Ys Jagan-Politi

ఈ వార్తలు అలా వైరల్ అవుతున్న సందర్భంలోనే వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా షర్మిల పార్టీలో పొంగులేటి చేరతారని కూడా గుసగుసలు వినిపించాయి.అయితే షర్మిల పార్టీలో చేరే అవకాశం లేదని పొంగులేటి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలు సద్దుమణిగాయి.ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ లైన్ లోకి వచ్చింది.

పొంగులేటి, జూపల్లి ఇద్దరిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని హస్తం నేతలు గట్టి ప్రయత్నలే చేస్తున్నారు.ఇటీవల రాహుల్ గాంధీ( Rahul Gandhi ) టిమ్ కూడా వారితో చర్చలు జరిపారు.

దాంతో పొంగులేటి మరియు జూపల్లి ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగానే ఉన్నారట.ఇంతలోనే ఇద్దరు కూడా ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డితో( CM Jaganmohan Reddy ) భేటీ కావడం ఒకింత ఆసక్తికరంగా మారింది.

Telugu Ap, Brs Ponguleti, Cmjaganmohan, Rahul Gandhi, Telangana, Ys Jagan-Politi

అయితే జగన్ తో తనకున్న సన్నిహిత్యం కారణంగా పొంగులేటి భేటీ అయిండవచ్చని.భావించినప్పటికి ఈ భేటీలో రాజకీయ కోణం కూడా ఉందనేది కొందరు చెబుతున్న మాట.ఏ పార్టీలో చేరాలనే దానిపై జగన్ తో చర్చించేందుకే పొంగులేటి భేటీ అయ్యారని ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో వినికిడి.ఏదైనా జాతీయ పార్టీలో చేరాలని చూస్తున్న పొంగులేటికి కాంగ్రెస్ లో చేరమని జగన్ సూచించారట.

అందుకు పొంగులేటి మరియు జూపల్లి ఇద్దరు కూడా అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక త్వవరలోనే ఈ ఇద్దరు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అయితే ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ బలం మరింత పెరిగే అవకాశం ఉంది.ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి హవా గట్టిగా ఉంది.

దాంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.ఇక వీరిద్దరు నిజంగానే కాంగ్రెస్ గూటికి చేరితే ఉమ్మడి ఖమ్మ జిల్లాలో బి‌ఆర్‌ఎస్ పై తీవ్ర ప్రభవమే చూపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube