యూకే కొత్త కేబినెట్‌లో ఈసారి ఛాన్స్ దక్కేది ఒకే ఒక్క భారతీయురాలికేనా

బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో బ్రిటన్‌లో ప్రధాని ఎన్నికలు హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే.కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పలువురు ప్రధాని పదవి కోసం పోటీపడినప్పటికీ కేవలం రిషి సునాక్, లిజ్ ట్రస్ మాత్రమే తుది పోరులో నిలిచారు.

 Suella Braverman May Be Only Indian-origin Mp In Britain New Cabinet , Suella Br-TeluguStop.com

మలి విడతలో రిషికి అనూహ్య పోటీ ఇచ్చిన లిజ్ ట్రస్‌కే ప్రధాని గెలిచే అవకాశాలు మెరుగ్గా వున్నాయని సర్వేలన్నీ బల్లగుద్ది చెబుతున్నాయి.మరి విజేత ఎవరో కొద్దినిమిషాల్లోనే తేలిపోనుంది.

లిజ్ ట్రస్ ఎన్నికైతే.మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా గెలిచిన మూడో మహిళగా రికార్డుల్లోకెక్కుతారు.

రిషి సునాక్ గెలిస్తే అది కనీవినీ ఎరుగని చరిత్రే.ఒకవేళ తాను ఓడిపోతే తదుపరి ప్రభుత్వానికి మద్ధతు కొనసాగిస్తానని ఆయన తెలిపారు.

ఎంపీగానే కొనసాగుతానని, తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని రిషి సునాక్ స్పష్టం చేశారు.

ఇక అసలు విషయంలోకి వెళితే.

లిజ్ ట్రస్ ప్రధానిగా గెలిస్తే భారతీయులకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తారనే దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బోరిస్ జాన్సన్ తన హయాంలో రిషి సునాక్, సుయెల్లా బ్రేవర్‌మాన్, అలోక్ వర్మ, ప్రీతి పటేల్‌ వంటి భారత సంతతికి చెందిన నేతలకు కీలక పదవులు కట్టబెట్టారు.

మరి లిజ్ ట్రస్‌ తన కేబినెట్‌లో ఎంత మంది భారత మూలాలున్న వారికి పదవులు కట్టబెడతారనే ప్రశ్నకు కేవలం ఒక్కరు మాత్రమే అనే జవాబు వినిపిస్తోంది.అది కూడా ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా వున్న సుయెల్లా బ్రేవర్‌మాన్‌కే అని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఆమెను ప్రీతి పటేల్ స్థానంలో హోం సెక్రటరీగా నియమించాలని లిజ్ ట్రస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం ప్రధాన మంత్రి రేసులో తాను గెలిస్తే.

దేశంలోని కీలక కార్యాలయాల్లో ఒకటిగా పరిగణించబడే హోమ్ ఆఫీస్‌కి అధిపతిగా నియమిస్తాననే హామీ మేరకు ట్రస్‌కు బ్రేవర్‌మాన్ మద్ధతు పలికినట్లుగా తెలుస్తోంది.వాగ్థానం మేరకు సుయెల్లాకు హోమ్ సెక్రటరీగా పదోన్నతి లభిస్తే.

పోలీస్, ఉగ్రవాద నిరోధకం, ఇంటెలిజెన్స్‌ విభాగాలకు ఆమె సారథ్యం వహిస్తారు.అంతేకాదు.

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన గడువు ముగిసినా ఇక్కడే వుంటోన్న అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే బాధ్యత కూడా బ్రేవర్‌మాన్‌కే కట్టబెట్టే అవకాశం వుంది.

Telugu Bangladesh, India, Indian Origin, Liz Truss, Mp Britain, Pakistan, Rishi

నార్త్ లండన్‌లోని హారోలో ఏప్రిల్ 3, 1980లో జన్మించారు సుయెల్లా బ్రేవర్‌మాన్ .ఆమె అసలు పేరు స్యూ- ఎల్లెన్ కాసియానా ఫెర్నాండెజ్‌.తండ్రి క్రిస్టీ, తల్లి ఉమా ఫెర్నాండెజ్.

వీరిద్దరూ భారత సంతతికి చెందినవారే.వివాహం తర్వాత కెన్యా, మారిషస్‌లలో వున్న ఈ జంట 1960లలో బ్రిటన్‌కు వలస వచ్చారు.ఆమె తల్లి వృత్తి రీత్యా నర్సు.2001 సాధారణ ఎన్నికలలో, 2003 బ్రెంట్ ఈస్ట్ ఉపఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు.బ్రేవర్‌మాన్ తల్లిదండ్రులు హిందువులు.కానీ ఈమె మాత్రం త్రిరత్న బౌద్ధ సంఘంలో సభ్యురాలు.లండన్ బౌద్ద కేంద్రానికి ఆమె ప్రతి నెలా హాజరవుతారు.బుద్ధుని సూక్తుల సమాహారమైన ధమ్మపదంపై ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

సుయెల్లా భర్త పేరు రేల్ బ్రేవర్‌మాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube