సుడిగాలి సుధీర్ క్రేజ్ ఈ రేంజ్ లో పెరిగిందా.. బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

బుల్లితెర స్టార్ కమెడియన్లలో సుడిగాలి సుధీర్( Sudigali sudheer )ఒకరు కాగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించిన షోలు, కమెడియన్ గా చేసిన షోలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.

ప్రస్తుతం పలు సినిమాలలో హీరోగా నటిస్తున్న సుధీర్ ఆ సినిమాలతో కూడా అనుకూల ఫలితాలను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

అయితే సుధీర్ కొత్త సినిమా ఏకంగా 9 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

సుధీర్ ప్రస్తుతం గోట్ అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండగా నరేష్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు.గతంలో పాగల్ సినిమాను తెరకెక్కించిన ఈ దర్శకుడు ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.రిలీజ్ డేట్ విషయంలో పొరపాట్లు , కథ కథనంలో తప్పులు, సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.అయితే పాగల్ సినిమా ( Paagal movie )కమర్షియల్ లెక్కల ప్రకారం సేఫ్ ప్రాజెక్ట్ కావడం గమనార్హం.9 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన గోట్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తే మాత్రం సుడిగాలి సుధీర్ తో మరిన్ని భారీ సినిమాలను తెరకెక్కించే దిశగా నిర్మాతల అడుగులు పడే అవకాశం అయితే ఉంది.సుధీర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

సుధీర్, రష్మీ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

రష్మీ హీరోయిన్ గా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాపైన నేపథ్యంలో సుడిగాలి సుధీర్ సినిమాతో రష్మీ సక్సెస్ సాధిస్తే ఆమె కూడా కెరీర్ పరంగా బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయి.రష్మీకి సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది.సుధీర్, రష్మీ ( Rashmi Gautam )జోడీ బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ జోడీ కలిసి నటిస్తే ఆ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు