సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుధీర్ కు యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.

 Sudigali Sudheer Love Breakup Story , Sudigali Sudheer, Jabardasth, Break Up Lov-TeluguStop.com

సుధీర్ కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా మెజీషియన్ గా, డాన్సర్ గా, హీరోగా ఇలా అన్నిరంగాలలో కూడా తనదైన సత్తా చాటుతూ ఎంతోమంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.ఇక బుల్లితెరపై ఎన్నోరకాల ఈవెంట్ లో ప్రసారం అవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

ఆ ఈవెంట్ లలో సుధీర్ కనిపించాడు అంటే చాలు అక్కడ ఫ్యాన్స్ హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది.ఇకపోతే ఎక్స్ ట్రా జబర్దస్త్ షోని చాలామంది కేవలం సుడిగాలి సుదీర్ స్కిట్స్ కోసమే చూసే వాళ్ళు ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే సుడిగాలి సుదీర్ అభిమానులతోపాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా సుధీర్ పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.సుధీర్ అభిమానులు అయితే ఒక ఇంటివాడు అయితే చూడాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

ఇంకా చాలా మంది అయితే రష్మీని పెళ్లి చేసుకో మంటూ అడ్వైజ్ లు కూడా ఇస్తూ ఉంటారు.

సుధీర్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రతి ప్రోగ్రాం లో ఈవెంట్లలో పెళ్లి గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి.

సుధీర్ ఎప్పుడెప్పుడు పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేస్తాడా అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు సుధీర్.

సుధీర్ ఇప్పటికే చాలా సార్లు తన పాత లవ్ స్టోరీ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.తాజాగా మరొకసారి తన లవ్ స్టోరీ గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు.

Telugu Break Lovestory, Jabardasth, Sridevidrama-Movie

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమోలో సుధీర్ చుట్టూ సాగిన ఎపిసోడ్ లో సుధీర్ చాలా బాధపడుతూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.ఒక బ్రేక్ అప్ లవ్ స్టోరీ పర్ఫామెన్స్ ను చూసిన తరువాత తన పాత లవ్ స్టోరీ తలుచుకుని బాధపడ్డాడు.సుధీర్ మాటలకు జడ్జ్ అయిన ఇంద్రజ కూడా బాధపడటం తో మరింత డల్ అయిపోయాడు.తాను ఇంత మంది అభిమానులను పొందడానికి కారణం ఆమె అంటూ ఒక రకంగా ఆమె బ్రేకప్ తన కెరీర్ను కూడా నిలబెట్టింది అని తెలిపాడు సుదీర్.

తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కుటుంబ బాధ్యతలు తన కెరీర్ అని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube