జబర్దస్త్ లోకి సుధీర్ కానీ ఆ ఒక్కటే ప్రాబ్లం...

ఈటీవి లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో వల్ల చాలా మంది నటులు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు అలాంటి వాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకడు… ఇక ఈ షో ద్వారా పరిచయం అయిన కొందరు ప్రస్తుతం వెండితెరపై స్టార్ కమెడియన్స్, హీరోలుగా మారి తమ సత్తా చాటుతున్నారు.ఇక మరికొందరు బుల్లితెరకే పరిమితమై, తమదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు.

 Sudigali Sudheer Into Jabardasth But That's The Only Problem , Sudigali Sudheer-TeluguStop.com

అయితే స్టార్స్ ఒక్కొక్కరిగా తప్పుకున్న నేపథ్యంలో.ఈ కార్యక్రమం పట్ల ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఒకప్పుడు జబర్దస్త్ షోలు బుల్లితెరను ఏలాయి. రికార్డు టీఆర్పీతో సంచలనాలు నమోదు చేశాయి.

 Sudigali Sudheer Into Jabardasth But That's The Only Problem , Sudigali Sudheer-TeluguStop.com

జబర్దస్త్ నుండి మొదట నాగబాబు వెళ్లిపోయారు.ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ వంటి కమెడియన్స్ గుడ్ బై చెప్పేశారు.

మంత్రి పదవి రావడంతో రోజా కూడా జడ్జిగా తప్పుకున్నారు.సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో పాటు పలువురు స్టార్ కమెడియన్స్ జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయారు.

Telugu Gaalodu, Jabardasth, Nagababu, Roja, Sadha, Tollywood-Latest News - Telug

స్టార్స్ లేకపోవడంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి .పునర్వైభవం తెచ్చేందుకు మేకర్స్ బాగానే కష్టపడుతున్నారు.కష్టపడి గెటప్ శ్రీనును తిరిగి తీసుకొచ్చారు.హైపర్ ఆది వచ్చాడు కానీ మరలా వెళ్ళిపోయాడు.సుడిగాలి సుధీర్ హీరోగా బిజీ.ఇక జబర్దస్త్ జడ్జిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సదాని తీసుకు వచ్చారు .సదా( Sadha ) రాకతో షో కొంచెం కలర్ఫుల్ గా మారింది.ఆమె గ్లామర్, వెలుగులు పంచె నవ్వులు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి.

Telugu Gaalodu, Jabardasth, Nagababu, Roja, Sadha, Tollywood-Latest News - Telug

కృష్ణ భగవాన్( Krishna Bhagavaan ), సదా జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు.మొన్నటి వరకు కుష్బూ జడ్జిగా ఉన్నారు.సదా కొన్నాళ్ల పాటు జడ్జిగా ఉంటారనే ప్రచారం జరుగుతుంది.ఆమె పెర్ఫార్మన్స్ బాగుంటే పర్మినెంట్ గా సెట్ అయ్యే ఛాన్స్ ఉంది.సదా బుల్లితెర జడ్జిగా అపార అనుభవం కలిగి ఉన్నారు.తెలుగు, తమిళ భాషల్లో ఆమె పలు షోలకు జడ్జిగా వ్యవహరించారు.

ఇటీవల బీబీ జోడి జడ్జిగా కూడా చేశారు.అందుకే జబర్దస్త్ కి సదా ఫేమ్ తెచ్చిపెడతారని మేకర్స్ నమ్ముతున్నారు…ఇక అలాగే సుధీర్ సినిమాల్లో బిజీ ( Sudigali Sudheer )గా ఉన్నప్పటికీ కనీసం నెల కి ఒక్క ఎపిసోడ్ లో అయిన సుధీర్ ని తీసుకు రావాలని జబర్దస్త్ యాజమాన్యం చూస్తుంది మరి సుధీర్ వస్తాడా లేదా అనేది వేచి చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube