Sudheer Gaalodu Movie: కొత్త పాఠం నేర్పుతున్న 'గాలోడు'.. మాస్ మసాలా పడాలే కానీ..

గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.అయితే ఈ ఏడాదిలో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనుకునే లోపే మళ్ళీ ప్లాప్స్ ఎదురవుతున్నాయి.

 Sudheer Gaalodu Movie Gave New Lessions Details, Tollywood, Sudheer, Gaalodu Mov-TeluguStop.com

ప్రేక్షకులు వచ్చిన సినిమాను వచ్చినట్టు ప్లాప్ చేస్తుండడంతో టాలీవుడ్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.ప్రేక్షకులు కరోనా తర్వాత పూర్తిగా మారిపోయారు.

ఎంతటి స్టార్ హీరో సినిమా అయిన సరే కంటెంట్ బాలేకపోతే మొహమాటం లేకుండా రిజక్ట్ చేసేస్తున్నారు.

అలాగే సినిమా టికెట్ రేట్స్ కూడా భారీ స్థాయిలో పెరగడం, ఓటిటీల ప్రభావం కూడా పెరగడం కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రావడం లేదు.

దీంతో స్టార్ హీరోలు కూడా సెలెక్టివ్ కథలను ఎంచుకుని సినిమాలు చేస్తున్నారు.ఇక ప్రేక్షకులు కూడా కంటెంట్ ఉన్న కథలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే కంటెంట్ లేని స్టార్ హీరోల సినిమాలు అయిన సరే చూడడం మానేస్తున్నారు.

ఆచార్యనే ఇందుకు ఉదాహరణ.

ఇక కాంతారా వంటి చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది.అంతే కాకుండా ఈ సినిమా ఎవరిదో తెలియక పోయిన సినిమాను సూపర్ హిట్ చేసిన 400 కోట్లు వసూళ్లు రాబట్టేలా చేశారు.

Telugu Acharya, Gaalodu, Kantara, Sudheer, Sudheer Gaalodu, Tollywood-Movie

అలాగే మొన్న శుక్రవారం వచ్చిన సుధీర్ గాలోడు ఇప్పుడు కొత్త పాఠం నేర్పిస్తుంది.

ఈ సినిమాకు మౌత్ టాక్ లేకపోయినా.ప్రచారాలు సరిగ్గా చేయకపోయినా.వారం కూడా పూర్తి కాకుండానే మూడు కోట్లు రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.మరి అట్టట్ట ఉన్న ఈ సినిమాకే ప్రేక్షకులు ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టేలా చేస్తే.ఇక సరైన మాస్ బొమ్మ పడితే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

మాస్ మసాలా బొమ్మ పడితే కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం.అందుకే గాలోడు సినిమా మన వాళ్ళ కళ్ళు తెరిపించింది అని కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube