అనూప్ భండారి దర్శకత్వంలో కన్నడ నటుడు సుదీప్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ జంటగా నటించిన చిత్రం విక్రాంత్ రోణ.ఈ సినిమా జులై 28వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇకపోతే ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలోనే 100 కోట్ల క్లబ్ లో చేరి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అన్ని భాషలలోనూ ఎంతో మంచి విజయం అందుకోవడమే కాకుండా ఈ సినిమాలో మంగ్లీ పాడిన రారా రకమ్మ అనే పాట సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది.
ఇలా బిగ్ స్క్రీన్ పై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసి మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమైంది.ఈ క్రమంలోనే అన్ని భాషలు డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సమస్థ జీ 5 భారీ ధరలకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాని సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి జీ 5 యాప్ లో ప్రసారం చేయనున్నట్టు జీ 5 నిర్వాహకులు ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంటెన్సివ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని థియేటర్లో చూడలేని వారు ఇకపై జీ 5 లో చూసి ఆనందించవచ్చు.ఇక ఈ సినిమా కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు తమిళ భాషలలో కూడా మంచి విజయం సొంతం చేసుకుంది.
విడుదలైన నాలుగు రోజులకే ఈ సినిమా 100 కోట్లను సాధించింది అంటేనే ఈ సినిమా ఎలా ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది.