గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల( Naresh Pavitra Lokesh ) పేర్లు మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు అంటూ అనేక రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ పెళ్లి విషయంపై మాత్రం క్లారిటీ లేకపోవడంతో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఈ ఏడాది మొదట్లో ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని షేర్ చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
దానికి తోడు తాజాగా నరేష్, పవిత్ర లోకేష్ ల పెళ్లి వీడియోను నరేష్ తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.కానీ అది నిజం పెళ్లి వీడియో కాదని, సినిమా ప్రమోషనల్ వీడియో అనే అనుమానాలు తలెత్తాయి.
కాగా పవిత్ర లోకేష్‌ను చట్టబద్దంగా పెళ్లి చేసుకోవడానికి నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి( Ramya Raghupati ) విడకుల నోటీసులు పంపించారు.కానీ ఆమె మాత్రం విడాకులు ఇవ్వడానికి ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా పవిత్ర లోకేష్ మొదటి భర్త చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

గతంలోనే తన భార్య గురించి పలుసార్లు సంచలన వాఖ్యలు చేసిన సుచేంద్ర ప్రసాద్( Suchendra Prasad ) తాజాగా మరోసారి పవిత్ర లోకేష్ గురించి సంచలన కామెంట్స్ చేశాడు.ఈ సందర్భంగా సుచేంద్ర మాట్లాడుతూ.పవిత్రకు లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టమని, ఆ లైఫ్ కోసం ఆమె ఏ పని అయినా చేస్తుంది ఆమె అవకాశవాది అంటూ ఘాటుగా స్పందించారు సుచేంద్ర ప్రసాద్.
నరేష్ విషయంలో ఆమె ప్లాన్ వేరే ఉందని ఆమె ఆటం బాంబు పిలిచాడు.

విజయ నిర్మల గారు సంపాదించిన రూ.1500 కోట్ల ఆస్తిని నొక్కేయాలని నరేష్ తో లవ్ ట్రాక్ నడుపుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఎలా అయిన ఆస్తి కొట్టేయాలనే దురుద్దేశ్యంతోనే నరేష్ వెంట తిరుగుతోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సుచేంద్ర ప్రసాద్.
డబ్బు కోసమే ఇప్పటికి ఇద్దరికి విడాకులు ఇచ్చిందని, ఈ విషయం నరేష్ కు ఇంకా అర్థం కావడం లేదని అన్నారు.ఏదో ఒక రోజు ఆయనకు కూడా తెలిసిపోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సుచేంద్ర.







