ఆరో తరగతిలో తండ్రి మృతి.. తల్లి కళ్లలో ఆనందం కోసం ఐఏఎస్ కావడంతో?

కెరీర్ విషయంలో సక్సెస్ ను సొంతం చేసుకోవాలంటే షార్ట్ కట్స్ ఉండవు అనే సంగతి తెలిసిందే.ఎంతో కష్టపడితే మాత్రమే సక్సెస్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

 Success Story Of Surapati Prashant Kumar Details Here Goes Viral  In Social Medi-TeluguStop.com

ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే తండ్రి మరణించినా ఒక యువకుడు తన కలను నెరవేర్చుకున్నాడు.తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తన సక్సెస్ ను అమ్మకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాడు.

పట్టుదలతో లక్ష్యాన్ని సాధించిన సురపాటి ప్రశాంత్ కుమార్ ( Surapati Prashant Kumar )ప్రస్తుతం అసిస్టెంట్ కలెక్టర్ గా ఉన్నారు.

ట్రైనింగ్ లో భాగంగా ఆత్మకూరుకు వచ్చిన ప్రశాంత్ కుమార్ తన స్వస్థలం పార్వతీపురం అని చెప్పారు.

నాన్న బాబూరావు( Baburao )4 ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారని నేను ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే నాన్న మృతి చెందారని ప్రశాంత్ అన్నారు.అమ్మ ఏ.ఎన్.ఎంగా పని చేస్తున్నారని అన్నయ్య మల్టీ నేషనల్ కంపెనీలో( multinational company ) పని చేస్తున్నారని ప్రశాంత్ పేర్కొన్నారు.నేను ఏడో తరగతి వరకు పార్వతీపురంలో పదో తరగతి వరకు నాసిక్ లో చదివానని ఆయన అన్నారు.

Telugu Baburao, Diploma Vizag, Vasavi-Latest News - Telugu

వైజాగ్ లో డిప్లొమా( Diploma in Vizag ) చేసి వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి 2017 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.అమ్మ అన్నయ్యను, నన్ను కష్టపడి చదివించిందని ప్రశాంత్ కామెంట్లు చేశారు.అమ్మ తనకు వచ్చే జీతంతో నాకు ఏ లోటు లేకుండా పెంచిందని ప్రశాంత్ అన్నారు.

అమ్మ కళ్లలో ఆనందం నింపాలనే లక్ష్యంతో చదివానని ప్రశాంత్ కామెంట్లు చేశారు.

Telugu Baburao, Diploma Vizag, Vasavi-Latest News - Telugu

నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అనుకున్నది సాధించి కలెక్టర్ గా ఎంపికై అమ్మకు నా సక్సెస్ ను బహుమతిగా ఇచ్చానని ప్రశాంత్ చెప్పుకొచ్చారు.స్పష్టమైన లక్ష్యం ఉంటే సివిల్స్ సాధించడం కష్టం కాదని ఆయన అన్నారు.నెగిటివ్ గా మాట్లాడే వాళ్లకు దూరంగా ఉండాలని ప్రశాంత్ సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube