చదివింది ITI కానీ బ్రెయిన్‌ ఏమో IIT.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా అద్భుత ఆవిష్కరణ!

‘ఈమధ్య కుర్రోళ్ళు మామ్మూలుగాలేరు.ఛాన్సు ఇస్తే కామెడీ చంపేస్తారు!’ అనేది ఓ సినిమా డైలాగ్.

 Studied At Iti But Iit Is The Brain-TeluguStop.com

అయితే ఈ మాట అక్షరాలా సత్యం.ఒక్క కామెడీ ఏమిటి.

ఏదైనా అవలీలగా చేసి చూపిస్తారు.అయితే వారికీ కావలసిందల్లా ప్రత్సాహమే.

నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహంతో పాటు ఏదన్నా కనిపెట్టాలనే ఉత్సాహం ఉండాలి.సరిగ్గా ఈ మాటలను నిజం చేసాడు కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువరైతు.

అందరూ టెక్నాలజీ సాయంతో వింత వస్తువులు, విచిత్రమైన యాప్‌లు కనిపెడుతుంటే.అతడు రైతన్నకు మేలు చేసే వస్తువు ఏదన్నా సృష్టిస్తే బాగుంటుందని భావించాడు.

అనుకున్నదే తడవుగా వరినాట్లు వేసే యంత్రాన్ని తానే స్వయంగా తయారు చేసి, రైతులకు ఖర్చుతో పాటు శ్రమ భారాన్ని తగ్గించాడు ఆ యువ రైతు నాగస్వామి.వ్య‌వ‌సాయం నేడు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది.

ఇంకా పాతపద్ధతలనే అనుసరిస్తే వ్యవసాయాలు చేయలేని పరిస్థితి.వ్యవసాయం పూర్తిగా యంత్రాలతోనే సాగుతున్న పరిస్థితి ఇపుడు నెలకొంది.

ఎందుకంటే శ్రమ, సమయం ఆదాయం అవుతోంది.వందమంది చేయగలిగిన పనిని ఓ యంత్రం పూర్తి చేస్తుంటే వ్యయం కూడా పెద్దమొత్తంలో తగ్గుతోంది.

అందుకే పల్లెల్లో వున్నవారు కూడా ఇలాంటి యంత్రాలవైపు మొగ్గు చూపుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ యువరైతు చేసిన ఆవిష్కరణ న భూతో న భవిష్యతి.

వరి సాగుకు రైతులు పెట్టే ఖర్చు వరినాట్ల దగ్గరే ఎక్కువగా ఉండటంతో ఆ భారాన్ని తగ్గించడానికి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి నాగస్వామి అనే యువరైతు నూతన యంత్రాన్ని తయారు చేసి, రికార్డులకెక్కాడు.బేసిగ్గా ITI పూర్తి చేసిన అతడు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటూ వచ్చాడు.

ఇక కరోనా కష్టకాలం తరువాత ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి రావాల్సిన పరిస్థితి కలిగింది.ఈ నేపథ్యంలో ఈ ఆవిష్కరణ జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube