నేటి విద్యావిధానంపై 'నో బ్యాగ్ డే'లో స్టూడెంట్స్ సెటైర్... కాలేజ్ బ్యాగ్‌కి బదులు ప్రెషర్ కుక్కర్!

మన ఆడవాళ్ళకి బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం.ఎంతలా అంటే… స్కూల్ ఏజ్ లో పుస్తకాలు, లంచ్ బాక్స్, స్నాక్స్ వంటివి బ్యాగ్ నిండా నింపుతారు.

 Students Celebrate No Bag Day Bring Pressure Cooker To College Details, Students-TeluguStop.com

ఇక కాలేజ్ చదువులకొచ్చేసరికి పుస్తకాలతో పాటు మ్యాకప్ కిట్, చాక్లైట్స్‌తో పాటు చాలా వస్తువుల్ని మోస్తూ వుంటారు.తరువాత ఉద్యోగంలో చేరితే ఇక చెప్పాల్సిన పనిలేదు.

అందులో దాదాపుగా బ్యూటీ కి సంబంధించిన వస్తువులే ఉంటాయి.మరీ ముఖ్యంగా చెప్పాలంటే వారు పుస్తకాలకంటే కూడా ఇలాంటి సామాగ్రిని మోసేందుకే ఇష్టపడతారు.

అయితే అలాంటి వారిని ఒకరోజు బ్యాగ్ క్యారీ చేయద్దు, దాని ప్లేసులో వేరేదైనా క్యారీ చేయండి అంటే ఏం చేస్తారు? ఈ ఆలోచనే చాలా వింతగా ఉంది కదా.విషయంలోకి వెళితే… స్టూడెంట్స్‌లో క్రియేటివిటీ నింపేందుకు, వాళ్లని యాక్టివ్ చేసేందుకు కాలేజీలలో సరదాగా ఒక్కోసారి కొన్ని రకాల కార్యక్రమాలు చేపడుతూ వుంటారు.ఈ క్రమంలోనే చెన్నై క్రిష్టియన్ ఉమెన్స్ కాలేజ్ విద్యార్ధినులకు ఓ వింత ఆలోచన వచ్చింది.కాలేజ్‌కి బ్యాగ్ కాకుండా ఇంకేదైనా తీసుకుని రావాలంటే ఏం చేస్తారు? అనే ఆలోచనతో ‘నో బ్యాగ్ డే’ ( No Bag Day ) నిర్వహించగా ఈ కాన్సెప్ట్‌కి స్టూడెంట్స్ నుంచి భలే రెస్పాన్స్ వచ్చింది.

ఒక్కో విద్యార్థి తమ క్రియేటివిటీకి పని చెప్పారు.ఈ క్రమంలో బాస్కెట్, టవల్, బకెట్, కార్డ్ బోర్డ్, పిల్లో కవర్, స్యూట్ కేస్, ట్రాలీ బ్యాగ్, మగ్, షూట్ కేష్… ఇలా రకరకాల వస్తువులలో తమ కాలేజ్ కి వెళ్లగా అందులో కొందరు విద్యార్ధినులు ( Students ) బ్యాగ్‌కి బదులుగా ఏకంగా ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్లడం ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.ఈ వీడియోని సోషల్ మీడియాలో చూసినవారంతా రెస్పాండ్ అవుతున్నారు.ముఖ్యంగా ప్రెషర్ కుక్కర్ ని ( Pressure Cooker ) ఉద్దేశించి….‘నిజమే మన విద్యావిధానం ప్రెషర్ కుక్కర్ మాదిరే ఉంటుంది.’ అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube