250 రూపాయల కోసం శోభన్ బాబు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసా..?

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత సెలబ్రిటీలు సులభంగానే కోట్ల రూపాయలు సంపాదించగలుగుతారు.

అయితే ఆయా హీరోలు ఆ స్థానాన్ని సంపాదించుకోవడానికి పడే కష్టాలు మాత్రం అన్నీఇన్నీ కావు.

బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో పాటు ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లు డబ్బు సంపాదించుకోవడం తేలికే అయినా కెరీర్ తొలినాళ్లలో ఆకలితో అలమటించిన హీరోలు సైతం ఎంతోమంది ఉన్నారు.కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించుకున్న హీరోలలో శోభన్ బాబు కూడా ఒకరు.

శోభన్ బాబు దగ్గర పని చేసిన వాళ్లు సైతం ప్రస్తుతం మంచి పొజిషన్ లో ఉన్నారు.చెన్నైతో పాటు పలు ప్రాంతాలలో భూములపై ఇన్వెస్ట్ చేయడం వల్లే శోభన్ బాబు కనీవిని ఎరుగని స్థాయిలో డబ్బును సంపాదించుకున్నారు.

అయితే ఒకానొక సమయంలో శోభన్ బాబు 250 రూపాయలు సంపాదించడానికి కూడా ఇబ్బంది పడ్డారట.

Advertisement

ఒక ఇంటర్వ్యూలో శోభన్ బాబు స్వయంగా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.లా చదువుకున్న శోభన్ బాబు నటనపై ఎంతో ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి వచ్చానని అయితే సినిమాల్లో కెరీర్ తొలినాళ్లలో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందని శోభన్ బాబు చెప్పుకొచ్చారు.భార్య, నలుగురు పిల్లలు ఉండటంతో భోజనం తింటే కాఫీ తాగలేని పరిస్థితి కాఫీ తాగితే భోజనం తినలేని పరిస్థితి ఉండేదని శోభన్ బాబు తెలిపారు.

నెలకు అన్ని ఖర్చుల కోసం 250 రూపాయలు అవసరమని చేసిన వ్యాపారాలు కూడా తనకు నష్టాలను మిగిల్చాయని శోభన్ బాబు అన్నారు.ఆ తర్వాత రోల్ చిన్నదో పెద్దదో ఆలోచించకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శోభన్ బాబు విజయాలను అందుకున్నారు.అనంతరం భూములపై శోభన్ బాబు ఇన్వెస్ట్ చేసి భారీ మొత్తంలో డబ్బు సంపాదించారు.

Advertisement

తాజా వార్తలు