పటిష్ఠ నిఘా మధ్య బద్వేలు ఉపఎన్నికను స్వేచ్ఛగా న్యాయబద్ధంగా.ప్రశాంతంగాా.
నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయనంద్ తెలిపారు.అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందన్నారు.ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని ఎన్నికల నియమావళి గురించి వివరించామన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ఎన్నికల వ్యయంపై నిరంతర పర్యవేక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.కడప జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక పోలీస్ పోస్ట్, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల వ్యయంపై ప్రత్యేక నిఘా కోసం 8 టాస్క్ఫోర్స్ టీమ్ లు మండలానికి మూడు చొప్పున మొత్తం 21 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 3 వీడియో వ్యూయింగ్ టీమ్ లను, 4 ఎన్నికల వ్యయ పరీక్ష టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు.మొత్తం 281 పోలింగ్ స్టేషన్ లకు గాను 140 పైచిలుకు పోలింగ్ స్టేషన్లలో లైవ్ టెలికాస్ట్ ద్వారా ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేశామన్నారు.
ఫిర్యాదుల స్వీకరణ తమ పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ (1950) వెబ్ సైట్, మొబైల్ యాప్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 8లోగా నామినేషన్ల దాఖలు చేసుకోవాల్సి ఉందని.30న ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది అన్నారు.80 సంవత్సరాల పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరుకున్నట్లుయితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.సెప్టెంబర్ 29 నాటికి నమోదు చేసుకున్న ఓటర్లను పరిగణంలోకి తీసుకుని మొత్తం 2 లక్షల 16 వేల154 మంది జనరల్, సర్వీసు ఓటర్లు లు ఈ ఉపఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ట్లు వెల్లడించారు.అక్టోబర్ 8 లోపు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నామినేషన్ సమయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ర్యాలీలు, ఉత్సవాలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు.ప్రచార సమయంలోనూ ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు సంబంధించి 1000 మందిని, వీధుల్లో సమావేశం 50 మందిని డోర్ టు డోర్ ఐదుగురిని, ఒక్కో అభ్యర్థికి 20 వాహనాలను 50 శాతం సిటింగ్ కెపాసిటీతో మాత్రమే అనుమతిస్తామని అన్నారు.రెండు సార్లు కోవిడ్ టీకా వేయించుకున్న వారిని ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.ఉప ఎన్నికల నిర్వహణలో వార్డు, గ్రామ వాలంటరీల ప్రమేయం ఏ మాత్రం ఉండబోదని వారిని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకుంటామని విజయానంద్ తెలిపారు.