విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన భారత సంతతికి చెందిన పోలీస్ అధికారికి అమెరికాలో అరుదైన గౌరవం లభించింది.కాలిఫోర్నియా( California )లోని ఒక రహదారికి దివంగత రోనిల్ సింగ్( Ronil Singh ) పేరు పెట్టారు.
న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన విధులు నిర్వర్తించేవారు.హైవే 33, స్టుహ్ర్ రోడ్లో “Corporal Ronil Singh Memorial Highway”ను సెప్టెంబర్ 2న జరిగిన వేడుకలో ఆవిష్కరించినట్లు స్థానిక మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది.
‘‘లవ్ యు పాపా’’ అంటూ సింగ్ కుమారుడు అర్నవ్.సైన్ బోర్డు వెనుక రాశాడు.
రోనిల్ చనిపోయినప్పుడు ఈ పిల్లాడికి ఐదు నెలల వయసు.ప్రస్తుతం తల్లి అనామిక, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు.
2019 సెప్టెంబర్‌లో అసెంబ్లీ
రవాణా కమిటీ
ద్వారా హైవే 33లోని కొంత భాగానికి సింగ్ పేరు పెట్టాలనే తీర్మానాన్ని ఆమోదించారు.ఫిజీ( Fiji )లో జన్మించిన రోనిల్ సింగ్ .మోడెస్టో పోలీస్ డిపార్ట్మెంట్లో వాలంటీర్‌గా చేరాడు.తర్వాత టర్లాక్ పోలీస్ డిపార్ట్మెంట్లో క్యాడెట్ , జంతు సేవా అధికారిగా పనిచేశాడు.
ఈ క్రమంలో 2018లో క్రిస్మస్ పర్వదినం నాటి రాత్రి ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నాడు.ఆ సమయంలో మద్యం మత్తులో వున్న ఓ డ్రైవర్.రోనిల్పై బుల్లెట్ల వర్షం కురిపించాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింగ్ ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర బృందాలు వేగంగా స్పందించాయి.
ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
కాగా.రెండేళ్ల క్రితం విధి నిర్వహణలో వుండగా దుండగుడి చేతిలో కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయిన సిక్కు పోలీసు అధికారి సందీప్ సింగ్ ధలీవాల్( Sandeep Singh Dhaliwal )కు కూడా అప్పట్లో అరుదైన గౌరవం లభించింది.పశ్చిమ హ్యూస్టన్‌లోని హారిస్ కౌంటీ పోస్టాఫీసు పేరును సందీప్ సింగ్ ధలీవాల్ పోస్టాఫీసుగా మారుస్తూ అక్కడి యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుడు డిప్యూటీ సందీప్ సింగ్ ధలీవాల్ జ్ఞాపకార్థం పశ్చిమ హారిస్ కౌంటీలో పోస్టాఫీసుకు ఆయన పేరును పెట్టి సత్కరించారని హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది.2019 సెప్టెంబర్ 27న ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న సందీప్ సింగ్‌ను ఓ దుండగుడు తుపాకీతో కాల్చాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సందీప్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో ఆయన స్మారకార్థం హ్యూస్టన్‌లోని 315 అడిక్స్ హోవెల్ రోడ్డులో ఉన్న పోస్టాఫీసును ‘డిప్యూటీ సందీప్ సింగ్ ధలివాల్ పోస్టాఫీస్ భవనం’గా పేరు మార్చి ఆయనను అమెరికా ప్రభుత్వం గౌరవించింది.
అందుకు సంబంధించిన బిల్లుపై నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో అది చట్టంగా మారింది.