కాపులను రెచ్చగొట్టడం వెనుక అంత కథ ఉందా పవన్ ? 

రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) కాపు సామాజిక వర్గం గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి.కాపుల్లో ఐక్యత లేదని, అదే ఉండి ఉంటే గత ఎన్నికల్లో తాను ఓడిపోయే పరిస్థితి ఉండేది కాదని పవన్ అన్నారు.

 Strategy Behing Pawan Kalyan Key Comments On Kapu Social Category Details, Pavan-TeluguStop.com

గత ఎన్నికల్లో కాపుల జనాభా ఎక్కువగా ఉన్న భీమవరం,  గాజువాక నియోజకవర్గం ఎంచుకుని మరి పోటీకి దిగినా,  తాను ఓడిపోవడం వెనక కాపుల్లో ఐక్యత లోపించడమే కారణమని పవన్ అన్నారు.

జనసేన, టిడిపి , వైసిపి లుగా కాపు సామాజిక  వర్గం నేతలు చీలిపోవడం వల్లే జనసేనకు ఆదరణ లభించడం లేదనే విషయాన్ని పవన్ చెప్పకనే చెప్పారు.

కాపులంతా ఐక్యంగా జనసేనకు మద్దతుగా నిలబడకుండా పార్టీల వారీగా విడిపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని పవన్ గుర్తు చేసే ప్రయత్నం చేశారు.అంతేకాదు ఎక్కడైనా, ఎప్పుడైనా కాపులంతా ఐక్యంగా తను వెంట నడవాలని విషయాన్ని పవన్ గుర్తు చేశారు.

జనసేనను (Janasena party) 20 సీట్లకి పరిమితం చేసామన్న వాదనను నమ్మవద్దని పవన్ కోరారు.లోపాయకారి ఒప్పందాలు పెట్టుకోనని, పార్టీని నమ్ముకున్న వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించనని,  ఒకరితో అవమాన పడి ఎందుకు ఉంటాను అంటూ ప్రశ్నించారు.ఎవరి అజెండాల కోసం జనసేన పనిచేయదని , పరోక్షంగా టిడిపి అంశాన్ని ప్రస్తావించారు.

అయితే పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వలన కారణాలు చాలా కనిపిస్తున్నాయి.ఇతర పార్టీల్లోని కాపు సామాజిక వర్గం నేతలు తనపై ఇప్పటివరకు చేస్తున్న ఎదురు దాడిని తగ్గించేందుకు,  అలాగే జనసేన లోకి వారిని రప్పించే వ్యూహం కనిపిస్తోంది.ఈరోజు బందర్ లో జరగబోయే బహిరంగ సభలోనూ కాపు సామాజిక వర్గం కు(Kapu social category) సంబంధించి పవన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ  విశ్లేషకుల అంచన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube