మనలో చాలామందికి డబ్బులు అత్యవసరం అయినపుడు ముందుగా గుర్తొచ్చేది బంగారం(Gold).అవును, ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి.
వారి దగ్గర డబ్బు సరిపడినంత చేతిలో ఉండదు కానీ… వారి వారి ఇళ్లల్లో మహిళల దగ్గర అవసరం మేరకు బంగారు ఆభరణాలు ఉంటాయి కాబట్టి, వాటిని తాకట్టు పెట్టి బ్యాంకులలో అప్పు తీసుకోవాలని అనుకుంటారు.అయితే అలాంటివారికి ఏయే బ్యాంకుల్లో ఎంత అప్పు ఇస్తారో మాత్రం అంతగా ఐడియా ఉండదు.
అలాంటివారికి ఈ కధనం.

ఇది సెక్యూర్డ్ లోన్(Secured Loan) కాబట్టి తక్కువ వడ్డీ రేటు ఉంటుంది.అత్యవసర సమయంలో బంగారం రుణం పొందడం ఇతర మార్గాల కంటే చాలా సులభం కూడాను.బ్యాంకు ఖాతా(Bank Account) ఉంటే బ్యాంకులు వేగంగా గోల్డ్ లోన్ మంజూరు చేస్తాయి.
ఇక్కడ వివిధ బ్యాంకుల్లో వివిధ గోల్డ్ లోన్(Gold Loan) వడ్డీ రేట్లు వుంటాయని వినియోగదారులు గుర్తు పెట్టుకోవాలి.వివిధ బ్యాంకులు బంగారంపై రుణాన్ని దాని వ్యాల్యూ ఆధారంగా ఇస్తాయి.
బహిరంగ మార్కెట్ కంటే బ్యాంకుల్లో రుణ వడ్డీ రేటు తక్కువని అందరికీ తెలిసినదే.అత్యవసర రుణం కోసం గోల్డ్ లోన్ మంచి ఎంపిక.బంగారంపై రుణాలు ఇచ్చే బ్యాంకులు 7.39 శాతం నుండి వడ్డీ రేటును ప్రారంభిస్తున్నాయి.

సాధారణంగా బంగారం రుణాలలో తాకట్టు పెట్టిన బంగారానికి మార్కెట్ వ్యాల్యూలో 75 శాతం వరకు రుణ సంస్థలు రుణాన్ని ఇస్తున్నాయి.రుణ చెల్లింపుల్లో ఆలస్యం, ఛార్జీ వంటి అంశాల్లో నిర్లక్ష్యం చేస్తే రీపేమెంట్‌లో ఆలస్యం కారణంగా అదనపు ఛార్జీ, బంగారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది.ఇక ఇక్కడ ఏయే బ్యాంకు ఏ విధంగా వడ్డీరేట్లు సంవత్సర కాలానికి విధిస్తాయో చూడండి.
ఎస్బీఐ: 7.40% ఫెడరల్ బ్యాంకు: 7.39 % HDFC బ్యాంకు: 7.55% పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు: 7.40% పంజాబ్ నేషనల్ బ్యాంకు: 7.65% బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.40% కెనరా బ్యాంకు: 7.65% కర్నాటక బ్యాంకు: 8.49% ఇండియన్ బ్యాంకు: 8.50% ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు: 8.85% బ్యాంక్ ఆఫ్ బరోడా: 9.40% యూనియన్ బ్యాంకు: 9% ఐసీఐసీఐ బ్యాంకు: 10% యాక్సిస్ బ్యాంకు: 14% మణప్పురం: 9.90% బజాజ్ ఫిన్ సర్వ్ 10% ముథూట్ ఫైనాన్స్: 11.90%
.






