అక్కడి పార్లమెంటులో జరిగిన తంతుకి నెటిజన్లు నివ్వెరపోయారు.అవును.
పార్లమెంట్‌లో యువకులు చేసిన డ్యాన్స్ ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఇక నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఐరోపా భవిష్యత్, కల్చర్ ఇదేనా అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళితే, తాజాగా యూరప్ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా భాగంగా 4 రోజుల పాటు ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో EU (యూరోపియన్ యూనియన్) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్‌లో సమావేశాలు చేపట్టాయి.
ఇక ఇక్కడ జరిగిన సమావేశాల్లో లాస్ట్ రోజు సందర్భంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న అంశంపై చర్చించారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, ఈ సమావేశం మరికొద్ది నిమిషాల్లో పూర్తి అయిపోతుందనుకొంటుండగా కొందరు యువతీయువకులు సడెన్ గా ప్రత్యక్షమై 10 నిమిషాల పాటు డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు.ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.
దాంతో EU (యూరోపియన్ యూనియన్) భవిష్యత్తు ఇదే అయితే.మీరంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లేనని ఘాటుగా స్పందించారు.
ఈ క్రమంలో, సోషల్ మీడియాలో బ్రిటన్ కి చెందినటువంటి మరో నెటిజన్ స్పందిస్తూ.EUతో బ్రేకప్ పట్ల సంతోషంగా ఉన్నానంటూ కామెంట్ చేయడం విశేషం.
మరోవైపు తన కీలక ప్రసంగం ముందు జరిగిన ఈ డ్యాన్స్ ప్రదర్శనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాత్రం ఒకింత అసహనానికి గురయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ జరిగిన తంతుకి కారణం తమకు కూడా తెలియదని చెప్పడం కొసమెరుపు.
కాగా జరిగిన విషయంపైన విచారణ జరిపిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.