ప్రపంచం నలు మూలలా రోజూ ఏవో వింత సంఘటనలు సంభవిస్తూనే ఉంటాయి.కొన్ని సంఘటనలు చూస్తే నవ్వు తెప్పించేవిలా ఉంటే.
మరిన్ని వింత సంఘటనలు మాత్రం భయాన్ని కలిగిస్తాయి.తీరా అది ఏంటో తెలిసిపోయాక ఇంతేనా దీనికేనా ఇంతలా భయపడిందని అనుకుంటూ ఉంటారు.
ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది.ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.
కాలిఫోర్నియాలో నివాసం ఉండే ఓ మహిళ హార్బర్ బౌలేవార్డ్ రోడ్డులో ఉన్న కార్ స్టీరియో స్టోర్, అటో షాప్ గోడల మధ్య ఉన్న ఎనిమిది అంగులాల స్థలంలో ఇరుక్కుంటుంది.ఇలా ఇరుకున్న మహిళ చేసే ఆర్థనాదాలను విన్న చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కార్ స్టీరియో షాప్ టెర్రస్ పైకి ఎక్కి చూడగా వారు షాక్ కు గురయ్యారు.
ఆ రెండు బిల్డింగుల మధ్య ఓ మహిళ చిక్కుకుని ఉండడం వారు గమనించారు.
అంతే కాకుండా అలా ఆర్థనాదాలు చేస్తున్న మహిళ బట్టలు లేకుండా ఉండడం చూసి కంగు తింటారు.వెంటనే ఆ మహిళను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించగా వారు వెంటనే అక్కడకు చేరకుని సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి రెండు బిల్డింగుల మధ్య ఇరుకున్న మహిళను కాపాడతారు.సదరు మహిళ రెస్య్కూ సిబ్బంది సహాయంతో సురక్షితంగా బయట పడడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కానీ ఆ మహిళ రెండు గోడల మధ్య ఎలా చిక్కుకుందని, అంతే కాకుండా వస్త్రాలు లేకుండా ఎందుకు ఉందనే సందేహాలు వారిలో మెదిలాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును ప్రారంభించారు.
అతి తక్కువ సమయంలోనే నిజా నిజాలను ఏంటనేవి బయటకు వస్తాయని చెబుతున్నారు.