విచిత్రమైన రంపం చేప..మీరు ఎప్పుడైనా చూశారా?

దేశంలో సముద్రం వద్ద రకరకాల చేపలను చూశాం.మనకు నచ్చని చేపను చాలా ఇష్టంగా తింటాం.

 Strange Chainsaw Fish , Chainsaw Fish , Carpenter Shark , Ian Atherton , Flori-TeluguStop.com

కానీ మనకు తెలియాని చేపలు చాలా ఉన్నాయి.ఈ భూమిపై విచిత్రమైన జీవుల్లో సా ఫిష్ ఒకటి.

దానికి ఉన్న రంపపు మూతిని రోస్ట్రమ్ అంటారు.అది ఐదు అడుగుల పొడవు పెరగగలదు.ఈ చేపను కార్పెంటర్ షార్క్ అని కూడా అంటారు.ఈ చేపలు 16 అడుగుల పొడవు పెరగగలవు.

యూరప్‌లోని లంకాషైర్‌కి చెందిన ఇయాన్ అథెర్టాన్… అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లాడు.అక్కడ చేపలు పట్టే వాళ్లు ఎక్కువ.

అక్కడి ఫిన్ అండ్ ఫ్లై చార్టర్స్ సంస్థ సభ్యులను కలిశాడు.ఏం కావాలి అని అడిగితే… నేనో షార్క్ చేపను పట్టాలి అనుకుంటున్నాను.

హెల్ప్ చేస్తారా అని అడిగితే మేం ఉన్నదే అందుకు ఛలో అంటూ సముద్రంలోకి తీసుకెళ్లారు.అదేం చిత్రమో గానీ ఫ్లోరిడా సముద్రంలో రకరకాల సముద్ర జీవులు కనిపిస్తుంటాయి.

ఆ రాష్ట్రంలో మొసళ్లు కూడా ఎక్కువే.రోడ్లపై కుక్కల లాగా మొసళ్లు తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడూ.

కొంతమందితో బోటులో స్పేస్ కోస్ట్ తీరం వెంట వెళ్లిన ఇయాన్ గేలం వేశాడు.చేప రాలేదు.అలా ఎదురుచూశాడు.సడెన్‌గా ఏదో కదలిక.

ఎవరో నీటి లోంచీ గేలాన్ని లాగేసుకుంటున్న ఫీలింగ్.అంతే షార్క్ దొరికినట్లే అనుకున్నాడు.

గేలాన్ని బలంగా లాగాడు.చూస్తే నీటి లోంచి రంపం పైకి వచ్చింది.

ఆశ్చర్యపోయాడు.ఇదేంటి రంపంలా ఉంది అనుకున్నాడు.

అదో రకం షార్క్ చేప కావచ్చు అనుకున్నాడు.ఎగిరి గంతేద్దాం అనుకున్నాడు.

బోటులో బాగోదులే అని కంట్రోల్ చేసుకున్నాడు.గేలానికి చిక్కిన చేప చాలా తెలివైంది.

ఎలాగైనా విడిపించుకొని పారిపోవాలని గట్టిగా ప్రయత్నించింది.అక్కడక్కడే తిరిగింది తప్ప దొరకకుండా ఏడిపించింది.

ఇలా గంటపాటూ గింజుకున్న చేప చివరకు దొరకక తప్పలేదు.

Telugu Carpenter Shark, Chainsaw Fish, Crocodiles, Florida, Ian Atherton, Fish-L

ఆ చేపను నీటిలో ఉంచుతూనే తీరానికి తీసుకొచ్చాడు.అప్పుడు దాన్ని చూస్తే అది షార్క్ కాదనీ రంపపు చేప అని అర్థమైంది.మిగతా వాళ్లంతా సూపర్ తమ్ముడూ రంపపు చేపను పట్టావు గ్రేట్ అని మెచ్చుకున్నారు.

కానీ ఇయాన్‌కి ఏదో తెలియని బాధ.తాను ఓ అరుదైన చేపను పట్టుకున్నానే అని.అలాంటి చేపను చంపడం అతనికి ఇష్టం లేదు.సో కాసేపు దాన్ని అందరికీ చూపించి తిరిగి సముద్రంలో వదిలేశాడు.

అందరూ చూస్తుండగానే అది నీటిలో ఈదుకుంటూ వెళ్లిపోయింది.

ఈ భూమిపై విచిత్రమైన జీవుల్లో సా ఫిష్ ఒకటి.

దానికి ఉన్న రంపపు మూతిని రోస్ట్రమ్ అంటారు.అది ఐదు అడుగుల పొడవు పెరగగలదు.

ఈ చేపను కార్పెంటర్ షార్క్ అని కూడా అంటారు.ఈ చేపలు 16 అడుగుల పొడవు పెరగగలవు.

శతాబ్ద కాలంగా ఈ చేపల్ని తెగ చంపేశారు.దాంతో ఇవి అత్యంత అరుదైన, అంతరించిపోతున్న చేపల లిస్టులోకి వెళ్లిపోయాయి.

ఈ చేప వీడియోని ఫిన్ అండ్ ఫ్లై చార్టర్స్ వారు ఇన్‌స్టాగ్రామ్‌లోని తమ పేజీ లో పోస్ట్ చేశారు.బాగుంది కదూ ఆ చేప.దాన్ని డైనోసార్ అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా… బీస్ట్ అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube