సిల్వర్ స్క్రీన్ అనే పదం ఎలా పుట్టింది.. వెండి తెర అస్సలు ఇప్పుడు ఉందా ?

ఒక్క సినిమా .వందల విషయాలు.

 Story Behind Silver Screen Name,silver Screen,projectrs Quality,cinema,silver Sc-TeluguStop.com

సినిమా అనే పదం చుట్టూ ఒక అందమైన ప్రపంచమే ఉంది అంతే కాదు అర్ధం కానీ అగాధాలు ఉంటాయి.ఇక సినిమా పుట్టుక వెనక దాని టర్మినాలజీ వెనక అనేక అర్థాలు, నానార్థలు, పర్యాయ పదాలు కూడా ఉన్నాయ్.

మరి ఒక్కో దాని పుట్టుక వెనక ఒక్కో చరిత్ర ఉంటుంది.సినిమా థియేటర్ లో చూడాలంటే వెండి తెరపై చూస్తాము.

మరి ఈ వెండి తెర ఎలా పుట్టింది.సిల్వర్ స్క్రీన్ అని మొదట ఇంగ్లీష్ లో పుట్టిన ఈ పదాన్ని ఎందుకు ఇలాగే పిలుస్తున్నారు.

వెండి తెర కాకుండా బంగారు తెర అంటే పోయేది ఏముంది అనే కదా మీ అనుమానం.

Telugu Cine, Silver Screen, Silverscreen, Storysilver-Movie

వెండి తెర అనే పదం పుట్టడానికి వెనక ఒక కారణం ఉంది.సినిమా వచ్చిన తొలినాళ్లలో ప్రొజెక్టర్ల నుంచి వచ్చే తెల్లని కాంతి అంత స్ప్రష్టం గా ఉండేది కాదు.ఎదో కాంతి విహీనంగా కనిపిస్తూ బ్లాక్ అండ్ వైట్ లో అలుక్కుపోయినట్టు గా ఉండేది.

అందువల్ల స్ప్రష్టత ను పెంచడానికి దాదాపు వందేళ్ల క్రితం అంటే 1910 లో ప్రతిబింబ మెటాలిక్ పెయింట్‌ వాడి వెండి పూత తో చేసిన తెరలను కనిపెట్టి ఉపయోగించడం చేసారు.ఈ స్క్రీన్ అసలు పేరు సిల్వర్ లెంటిక్యులార్ స్క్రీన్స్.

నిలువు చర్యలతో కూడిన వెండి పూత కలిగి ఉంది ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండేవి.

Telugu Cine, Silver Screen, Silverscreen, Storysilver-Movie

కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది.ఇవి సినిమాను ప్రకాశవంతం గా ప్రదర్శించడానికి ఉపయోగపడ్డాయి.ఇంగ్లీష్ వారే ఇది తొలిగా కనిపెట్టారు.

ఇప్పుడు అంత కెమికల్ లేయర్స్ ని వాడుతున్నారు. ప్రొజెక్టర్ల క్వాలిటి కూడా పెరిగింది.

సిల్వర్ లెంటిక్యులార్ స్క్రీన్స్ కి పర్యాయ పదం గా సిల్వర్ స్క్రీన్ అనడం మొదలు పెట్టారు.దాంతో వెండి తెర లేదా సిల్వర్ స్క్రీన్ పేరు స్థిరస్థాయిగా నిలిచి పోయింది.

ఇప్పుడు వెండి పూత లేయర్స్ లేకపోయినా కూడా ఆ పేరు అలాగే వాడకం లో ఉండటం తో నేటికీ కూడా వెండి తెర పై సినిమా చూడాలి అంటూ ఉంటాం.కాలక్రమేణాన ఇంకా మెరుగైన తెరలు, ప్రొజెక్టర్ లు వస్తాయి ఇంకా సినిమా చూసే క్వాలిటీ మారిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube