అలాంటి ఎదవలకు దూరంగా ఉండండి... నటి దీపిక పోస్ట్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ( Deepika Padukone ) ఒకరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Stay Away From Such Scams Actress Eepikas Post Goes Iral , Deepika Padukone ,-TeluguStop.com

ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే దీపిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఏ విషయం గురించి అయినా మాట్లాడితే ముక్కు సూటిగా సమాధానం చెబుతూ ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తాజాగా దీపిక చేసినటువంటి వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా దీపిక ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.మీ బెస్ట్ ఫ్రెండ్ ని మీరు పెళ్లి చేసుకోండి ఈ విషయాన్ని నేను తేలిగ్గా చెప్పడం లేదు.ఎందుకంటే మీరు ప్రేమలో పడే వ్యక్తి మీకు నిజంగానే సంతోషకరమైన వాతావరణాన్ని ఇవ్వగలిగితే మీ కంటే గొప్పగా జీవించే వ్యక్తి మరొకరు ఉండరు .అలా కాకుండా పైకి మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం నటించి మోసం చేసే ఎదవలను మాత్రం నమ్మకండి వీలైనంతవరకు అలాంటి వారికి దూరంగా ఉండడం మంచిది.మీరు ఎవరితో అయితే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో అలాంటి వారిని పెళ్లి చేసుకోవడం మంచిది.

ముఖ్యంగా మీ అభిప్రాయాలకు, అభిరుచులకు గౌరవం ఇచ్చే వారినీపెళ్లి చేసుకోవడం మంచిద.

ఇలాంటి వ్యక్తులను పెళ్లి చేసుకోవడం వల్ల మీ ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుందని ఈమె తెలిపారు.ఇలా ప్రేమ గురించి ప్రేమించిన వ్యక్తుల గురించి దీపిక స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈమె కూడా తన సహనటుడు, ప్రాణ స్నేహితుడు రణవీర్ సింగ్( Ranveer Singh ) ను ప్రేమించి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) హీరోగా నటిస్తున్న కల్కి ( Kalki ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube