టాలీవుడ్ నటుడు కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసింది ఈ క్రమంలోనే నేడు కృష్ణంరాజు సంస్కరణ సభను ఏర్పాటు చేశారు.ఇక ఈ సంతాప సభ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు.
హైదరాబాద్ చేరుకోగానే కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించిన అనంతరం కృష్ణంరాజు సంస్కరణ సభలో పాల్గొన్నారు.క్షత్రియ సేవా సమితి అధ్వర్యంలో జేఆర్సీ కన్వెన్షన్‌లో సంస్కరణ సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత విలక్షణ నటుడు కృష్ణంరాజు అంటూ ఈయన ఆయన గురించి మాట్లాడారు.పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు అలా చరిత్రలో నిలిచిపోయే వారిలో కృష్ణంరాజు ఒకరిని తలసాని పేర్కొన్నారు.

తాను చిన్నప్పటినుంచి కృష్ణంరాజు సినిమాలు చూస్తూ పెరిగానని మర్యాదకు మరొక పేరు కృష్ణంరాజు గారు అంటూ ఈ సందర్భంగా కృష్ణంరాజు గారి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇక ఆయన వారసుడిగా ప్రభాస్ కూడా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని ఈయన పేర్కొన్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసినటువంటి కృష్ణంరాజు గారి విగ్రహాన్ని ఫిలింనగర్ లో ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణంరాజు గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.







