తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు గురించి తెలియని వాళ్ళు ఉండరు.ఇండస్ట్రీలో దాదాపు 180 సినిమాలకు పైగా నటించిన ఈయన హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా సందడి చేశారు.
ఇకపోతే కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చారు.ఈయన కూడా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు జాతీయస్థాయిలో హీరోగా గుర్తింపు పొందారు.
ఇలా ప్రభాస్ ఎదుగుదలను చూసి మురిసిపోయిన కృష్ణంరాజు నిత్యం తనని ఇండస్ట్రీలో ప్రోత్సహిస్తూ ఉండేవారు.
కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఎదుగుదలని చూసి కృష్ణంరాజు ఎంతో మెరిసిపోయారు.
ఈయన బ్రతికున్నప్పుడు ప్రభాస్ కు పెళ్లి చేయాలని ఎంతో పట్టుబడ్డారు.ప్రభాస్ కోసం గోదావరి జిల్లాలకు చెందిన రాజులు వంశస్థులు అమ్మాయిలను కూడా చూశారని ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లి చేయడమే అని ఒకప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి.
అయితే ప్రభాస్ అనుష్క ప్రేమలో ఉన్నారంటూ వీరి పెళ్లికి కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడం వల్లే ప్రభాస్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని అలాగే తన కుటుంబ సభ్యులు చూసిన సంబంధాలను కూడా రిజెక్ట్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఇకపోతే కృష్ణంరాజు మరణాంతరం ప్రభాస్ అనుష్క పెళ్లి విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది.వీరిద్దరి పెళ్లి గురించి కృష్ణంరాజు తన డైరీలో రాసుకున్నారని,ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అనుష్కతో ప్రేమే కారణం అంటూ ఈయన తన డైరీలో రాసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలను కృష్ణంరాజు సన్నిహితులు కొట్టి పారేశారు.
ఇలాంటి విషయాలను కృష్ణంరాజు గారు డైరీలో రాసుకోరు అసలు ఆయనకు డైరీ రాసే అలవాటు లేదు ఏ విషయం అయినా ముఖం మీదే చెప్పే అలవాటు రాజుగారికి ఉందని ఇలా సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి గురించి ఆయన డైరీలో రాసుకున్నారనే వార్త పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.








