మంచిర్యాలలో బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
మంచి ఎమ్మెల్యే గెలిస్తే మంచి ప్రభుత్వం వస్తుందన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని తెలిపారు.కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కనీసం మంచినీరు ఇవ్వలేదన్నారు.
కాంగ్రెస్ హయాంలో అన్ని ఆకలి చావులు, రైతు బలవన్మరణాలే ఉన్నాయన్నారు.కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
ఈ క్రమంలో మూడు గంటలు కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ కావాలో లేక 24 గంటల కరెంట్ తో పాటు రైతుబంధు, రుణమాఫీ అందించే బీఆర్ఎస్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని తెలిపారు.







