చాలాసార్లు మనం అనుకుంటాం వీరేం చేస్తారులే.కానీ వాళ్లే ఏదో ఒక రోజు మనం ఊహించిన స్థాయికి వెళ్తారు.
ఆరోజు వారు కొట్టే కొట్టుడు దెబ్బకి అందరూ అదిరి పోవాల్సిందే.ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఒక సంఘటన టాలీవుడ్ సెన్సేషనల్ గా మారిపోయింది.ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా జూనియర్ ఆర్టిస్ట్( Character Artist ) అనుకున్న వారు ఇప్పుడు టాలీవుడ్ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తున్నారు.100 కోట్ల కలెక్షన్స్ దాటి ప్రయాణం చేస్తున్నారు.అందరూ హిట్స్ ఇవ్వకుండా పడిపోయిన రోజు వీరు మాత్రమే సినిమా పరిశ్రమలో నిలబెట్టుతున్నారు.ఇది ఈరోజు టాలీవుడ్ లో కొత్త టాక్.ఇంతకీ టాలీవుడ్ ని సాధిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్( Junior Artist ) లు ఎవరు ? ఎలాంటి సినిమాలు తీస్తున్నారు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ). ఈ పేరు చెప్తే ఇప్పుడు టాలీవుడ్ లో చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది.సిద్దు తలుచుకుంటే 100 కోట్లు ఏంటి 1000 కోట్ల కలెక్షన్స్ సునామి సృష్టించడం అతడికి పెద్ద విషయమేమీ కాదు.
ఏదో ఒక రోజు కచ్చితంగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయి తీరుతాడు సిద్దు.అందుకు డీజే టిల్లు సినిమా( DJ Tillu Movie ) నుంచి పునాది పడింది.
ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇంకా థియేటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది.ఇదే దోవలో మరొక స్టార్ హీరో కూడా వచ్చేసాడు అతడు మరెవరో కాదు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) కూడా మొదట్లో కెరియర్ జూనియర్ ఆర్టిస్ట్ గానే మొదలుపెట్టాడు ఆ తర్వాత సైడ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల తీశాడు.ఇప్పుడు ఫ్యామిలీ స్టార్( Family Star ) అంటూ తెరపైకి వచ్చాడు ఈ సినిమా ఫలితం కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా విజయ్ దేవరకొండ ఉన్న ఫ్యాన్ బేస్ లో మాత్రం ఏ తేడా ఉండదు.విజయ్ అంటే సునామీ అని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది.
ఇక మరొక స్టార్ హీరో సైతం ఇలాగే జూనియర్ ఆర్టిస్ట్ గానే కెరియర్ మొదలుపెట్టాడు అతడే నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ). తీస్తే హిట్టు అన్నట్టుగా ఉంది నవీన్ సినిమాల పరిస్థితి.కాస్త ఆలస్యంగా సినిమాలు తీస్తున్నాడు కానీ తీసిన ప్రతి సినిమా విజయాన్ని అందుకోవడానికి అతను చేయాల్సిన ప్రతి పనిని చేస్తూ వస్తున్నాడు.
ఈ ముగ్గురు హీరోలు ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్టులే.ఆ తర్వాత సైడ్ ఆర్టిస్టులు… ఇప్పుడు టాలీవుడ్ ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు.