సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకుని అశేషమైన అభిమానులను సొంతం చేసుకుంది.
లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న నయనతార.విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులు మెప్పు పొందింది.
నయన్.హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటిస్తూనే.
ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్ ప్లే చేస్తూ సత్తా చాటుతోంది.
నయనతార చాలా రోజుల నుంచి కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది.
అలా ఉండటం వల్ల చాలా మంది హీరోలు, డైరెక్టర్స్ ఇబ్బందులు పడ్డారట.అందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కూడా ఉండటం గమనార్హం.
సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సందర్భంలో తాను ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొనబోనని నయనతార ముందే చెప్పేయడంతో పాటు ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకుంటుంది.ఈ నేపథ్యంలోనే నయనతార ఎటువంటి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనదు.
అయితే, ఫిల్మ్ ప్రమోషన్స్‌లో హీరో, హీరోయిన్‌తో పాటు మూవీ యూనిట్ సభ్యులు ముఖ్యం.కాగా, నయనతార ప్రమోషనల్ ఇంటర్వ్యూకు రాకపోవడంతో చిరంజీవి, వెంకటేశ్ ఇబ్బందులు పడ్డట్లు సమాచారం.

స్టార్ హీరోలే ఇటువంటి ఇబ్బందులు పడ్డారంటే… ఇక యంగ్ హీరోల సంగతి అంతే సంగతులు అన్న మాట.అయితే, స్టార్ హీరోలు అయినా ఎవరైనా తాను ప్రమోషన్స్‌కు రాననే ముందే చెప్పినప్పుడు ఆ తర్వాత ఎవరు రిక్వెస్ట్ చేసినప్పిటికీ తాను ఎటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్ రానని చాలా సార్లు నయన్ పేర్కొంది.నయనతారను ప్రమోషనల్ ఈవెంట్స్‌కు హాజరు కావాలని చాలా మంది అడిగినప్పటికీ తాను ముందే రానని చెప్పానని, కాబట్టి ఇప్పుడు రిక్వెస్ట్ చేసినా రానని తెగేసి చెప్పేసిందని తెలుస్తోంది.అయితే, నయనతారకు ఉన్న క్రేజ్ వల్ల ఆమె పట్టే కండిషన్స్‌ను ప్రొడ్యూసర్స్ కంపల్సరీగా ఒప్పుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నయనతార వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.మొదట్లో కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమాయణం జరిపిన నయనతార.ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పెళ్లి పీటల వరకు వెళ్లింది.ఆ తర్వాత ప్రభుదేవాను విడిచిపెట్టిన నయన్… ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉంది.
వీరిరువురు త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు సమాచారం.