బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.తన హోస్టింగ్ తో ప్రేక్షకుల్లో ఈ షోపై ఎన్టీఆర్ క్రేజ్ ను పెంచడంతో పాటు స్టార్ మా ఛానెల్ ను నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు.
అయితే బిగ్ బాస్ సీజన్2కు హోస్ట్ చేసే ఛాన్స్ దక్కినా ఎన్టీఆర్ మాత్రం ఆ షోను హోస్ట్ చేయడానికి అంగీకారం తెలపలేదు.ఆ తర్వాత సీజన్2కు నాని హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం నాని కూడా ఆ సీజన్ కు మాత్రమే పరిమితం కావడం జరిగింది.
ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్3 నుంచి అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.తన హోస్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నాగార్జునకు ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేస్తున్నారు.
తాజాగా నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు.వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకోనున్నారు.
నిన్న బిగ్ బాస్ షోకు గెస్ట్ గా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ హాజరయ్యారు.కోట్ల సంఖ్యలో మొక్కలను నాటించాలని సంతోష్ కుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

రేపటి ప్రగతికి పచ్చదనమే ఆరోగ్యమని ఆయన చెప్పుకొచ్చారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి సంతోష్ కుమార్ మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలై మూడు సంవత్సరాలు పూర్తైందని చెబుతూ బిగ్ బాస్ హౌస్ లో నాటాలని ఒక మొక్కను నాగార్జునకు బహుకరించారు.గడిచిన మూడు సంవత్సరాలలో 16 కోట్ల మొక్కలను నాటానని ఆయన వెల్లడించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రభాస్ 1650 ఎకరాలను దత్తత తీసుకున్నారని సంతోష్ కుమార్ అన్నారు.

కింగ్ నాగార్జున తాను కూడా అడవులను దత్తత తీసుకుంటానని వెల్లడించారు.సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ 1,000 ఎకరాలను దత్తత తీసుకుంటానని నాగార్జున చెప్పుకొచ్చారు.సమాజం విషయంలో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని నాగ్ పేర్కొన్నారు.