సాధారణంగా స్టార్ హీరోలలో కొంతమంది చేసే అతి మామూలుగా ఉండదని ఇండస్ట్రీలో టాక్ ఉంది.ఎండలో ఒక నిమిషం ఉన్నా కందిపోతామని భావించే హీరోల సంఖ్య, హీరోయిన్ల సంఖ్య అంతాఇంతా కాదు.
కొంచెం కఠినమైన సన్నివేశాలు ఉంటే చాలామంది హీరోలు తాము చేయలేమని ఆ సన్నివేశాలను డూప్ లతో చేయించాలని చెబుతుంటారు.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా చాలామంది హీరోలు, హీరోయిన్లు ఇదే విధంగా ఉంటారు.

అయితే ఈ విషయంలో స్టార్ హీరో బాలయ్య( Hero Balakrishna ) మాత్రం ఈ విషయంలో భిన్నమనే సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ కొడుకైనా, స్టార్ స్టేటస్ ఉన్నా, కోట్ల రూపాయల ఆస్తులు( Balakkrishna Properties ) ఉన్నా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నా అసిస్టెంట్ తో గొడుగు పట్టించుకోవడానికి కూడా బాలయ్య ఆసక్తి చూపించరు.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి పరిస్థితులలో షూటింగ్ కు హాజరు కావడం సులువు కాదు.అయితే స్టార్ హీరో బాలయ్య మాత్రం వర్షాలను లెక్క చేయకుండా షూటింగ్ కు హాజరై డెడికేషన్ ను ప్రూవ్ చేశారు.
నిర్మాతల శ్రేయస్సును కోరే అతికొద్ది మంది హీరోలలో బాలయ్య ముందువరసలో ఉంటారు.బాలయ్య పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్( Balakrishna Remuenration ) లో ఉండగా బాలయ్య స్థాయి సినిమా సినిమాకు పెరుగుతోంది.

బాలయ్య ఇతర భాషలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు.బాలయ్య పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధిస్తే బాలయ్య సినిమాల మార్కెట్ కూడా మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.బాలయ్యను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ సినిమాలకు పెద్ద పీట వేస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







